మానసిక వికలాంగులకు హక్కులంటాయి

మానసిక వికలాంగులకు హక్కులంటాయి
  • సీనియర్ సివిల్ జడ్జి జితేందర్

ముద్ర ప్రతినిధి, మెదక్:మెదక్ ప్రభుత్వ ఆసుపత్రిలో  లో మెంటల్ హెల్త్ డే సందర్బంగా మంగళవారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి సిహెచ్. జితేందర్ పాల్గొని మానసిక వికలాంగుల గురించి, వారి హక్కుల పరిరక్షణ గురించి వివరించారు. ఎక్కువగా నేరాలు పిల్లల అతిప్రవర్తన వల్ల జరుగుతాయని, కన్సిక్వెన్సెస్ తెలిసి చేస్తే తప్పని వివరించారు. మానసిక రోగం, మానసిక వైకల్యం రెండు రకాలుగా ఉంటుందన్నారు. మానసిక రోగంను మందుల ద్వారా సరిచేయవచ్చు కాని మానసిక వైకల్యంను సరిచేయలేమని తెలిపారు. ఈ కార్యక్రమంలో  డిఎంహెచ్ఓ డా.చందు నాయక్, ఎన్సిడి ప్రోగ్రాం ఆఫీసర్ మాధురి, డా.కిరణ్ రెడ్డి, దుర్గమని,  భాగ్య, సురేష్,  సోషల్ వర్కర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.