సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలి .మంత్రి జగదీశ్వర్ రెడ్డి

సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలి .మంత్రి జగదీశ్వర్ రెడ్డి

ముద్ర.తిరుమలగిరి: బిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలను గ్రామస్థాయిలో పార్టీ కార్యకర్తలు నాయకులుt విస్తృతంగా ప్రచారం చేసి రానున్న ఎన్నికల్లో తుంగతుర్తి సూర్యాపేట గడ్డపై గులాబీ జెండా ఎగరవేయడానికి     సైనికుల వలె పనిచేయాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల  జగదీశ్వర్ రెడ్డి అన్నారు శుక్రవారం నాడు తిరుమలగిరి  మున్సిపల్ కేంద్రంలోని ఎమ్మెల్యే నివాస సమీపంలో ఏర్పాటు చేసిన  బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి  ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఎన్నో ఉద్యమాలు నిర్వహించి ప్రాణ త్యాగాన్ని లెక్కచేయకుండా  తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని తెలంగాణ ప్రజల సంక్షేమం కోసంఎన్నో  పథకాలను అందిస్తున్నారని  అన్నారు పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రభుత్వ0 చేస్తున్న
 పథకాలను గ్రామస్థాయిలో బూతులెవల్  లో విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని కోరారు
నాటి ఉద్యమ కాలం నుండి నేటి బంగారు తెలంగాణ నిర్మాణంలో కార్యకర్తల పాత్ర ఎనలేనిదని తెలిపారు ముఖ్యమంత్రి కేసీఆర్  నాయకత్వనా బిఆర్ఎస్ సర్కార్ ప్రజలకు గొప్ప పాలన అందిస్తుందని కార్యకర్తలే బిఆర్ఎస్ పార్టీ పట్టుకొమ్మలని ఆయన అన్నారుకార్యకర్తలు పట్టుదలతో పని చేస్తూ మన ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకొని పోయి వారికి అర్ధమయ్యే విదంగా వివరించాలని కోరారుపార్టీ బలోపేతానికి  చేపట్టాల్సిన  సంక్షేమం, అభివృద్ధిపై  మంత్రి వివరి0చారు
 
నాటి ఉద్యమం నుండి నేటి వరకు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వనా మొక్కవోని దీక్షతో పని చేస్తున్నామని ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పని చేయాలని కార్యకర్తలందరికి పార్టీలో, సముచితమైన స్థానం కల్పిస్తామని ప్రభుత్వ పథకాలైన దళిత బంధు,డబల్ బెడ్ రూమ్ ముఖ్యమంత్రి సహాయనిధి కళ్యాణ లక్ష్మి పథకాలలో అర్హులైన నిరుపేద లీడర్లు కార్యకర్తల మధ్య సమన్వయంతో పని చేసి మన పార్టీని మరింత బలోపేతానికి కృషి చేయాలని కోరారు
 ముఖ్యమంత్రి కేసీఆర్ కేటీఆర్ నాయకత్వనా ఇంత గొప్ప ప్రగతిని సాధించుకున్న మనం దానిని ప్రజల్లోకి తీసుకొని పోయి వివరించాలని కార్యకర్తలను కోరారు.
ప్రభుత్వం చేపడుతున్న పధకాలు కల్యాణ లక్ష్మీ, షాధిముబారక్,ఆసరా,రైతు బంధు,రైతు బీమా,కేసీఆర్ కిట్ తో పాటు మరెన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు నిర్వహిస్తుందనిమనం చేస్తున్న ప్రగతి,అభివృద్ధి ఓర్వలేక ఇతర పార్టీలు అక్కసు కక్కి మనపై దుష్ప్రచారం చేస్తున్నారని దానిని కార్యకర్తలు తిప్పి కొట్టాలని  కోరారు .

ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ తుంగతుర్తి శాసనసభ్యులు గాదరి కిషోర్ కుమార్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు మన ప్రభుత్వం అందిస్తున్నదని కార్యకర్తలుగా మనం మన ప్రభుత్వం చేసింది చెప్పుకోవాలని  కోరారు. తుంగతుర్తి నియోజకవర్గంలో శ్రీరాంసాగర్ జలాల ద్వారా  రైతులకు ప్రజలకు తాగు సాగునీరు అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కింది అన్నారు ఒకనాడు హత్యలు ప్రతీకారదాదులతో  అట్టుడికిన  తుంగతుర్తి నియోజకవర్గం నేడు పచ్చని పొలాలతో సస్యశ్యామలంగా మారిందని అన్నారు నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు మిషన్ భగీరద్వార మంచినీటిని అందిస్తున్నామని అన్నారు

నియోజకవర్గంలో రైతుబంధు కళ్యాణ లక్ష్మి సిఎంఆర్ ఆసరా వృద్ధాప్య పింఛన్లు వికలాంగులకు పింఛన్లు అందిస్తున్నామని వీటిని కార్యకర్తలు విస్తృతంగా 
 ప్రచారం చేయాలని కోరారుఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ గు జ్జ దీపికా యుగంధర్ రావు తిరుమలగిరి మార్కెట్ కమిటీ చైర్మన్ కొమ్మినేని  స్రవంతి సతీష్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సంకేపల్లి రఘునందన్ రెడ్డి ఎంపీపీ నెమరు గోమ్మల స్నేహలత జడ్పిటిసి దుపటి ఆంజలు రవీందర్ నాయకులు కే లక్ష్మయ్య ప్రవీణ్ నరోత్తం రెడ్డి రాము గౌడ్ కౌన్సిలర్లు ప్రజాప్రతినిధులు సర్పంచ్లు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ముందుగా ఎస్ఎస్ఆర్ ఫంక్షన్ హాల్ నుండి ఎమ్మెల్యే నివాసం వరకు భారీ స్కూటర్ ర్యాలీ నిర్వహించారు