గోపల్ దీన్నే – సింగోటం కెనాల్ తో శాశ్వతంగా సాగునీటి సమస్యకు పరిష్కారం - మంత్రి జూపల్లి కృష్ణారావు

గోపల్ దీన్నే – సింగోటం కెనాల్ తో శాశ్వతంగా సాగునీటి సమస్యకు పరిష్కారం - మంత్రి జూపల్లి కృష్ణారావు

ముద్ర.వీపనగండ్ల:- ఉమ్మడి వీపనగండ్ల చిన్నంబావి మండలాల్లోని జూరాల, బీమా ఆయకట్టు భూములకు సింగోటం – గోపల్ దీన్నే కెనాల్ తో శాశ్వతంగా సాగునీటి సమస్యకు పరిష్కారం అవుతుందని రాష్ట్ర ఎక్సైజ్, సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం మండల పరిధిలోని తూముకుంట గ్రామంలో మండల పరిధిలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. సమావేశానికి ముందుగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ వీపనగండ్ల చిన్నంబావి మండలాల రైతుల సాగునీటి సమస్యను తీర్చడానికి సింగోటం రిజర్వాయర్ నుంచి గోపాల్ దిన్నె రిజర్వాయర్ వరకు ప్రత్యేక కాలువ నిర్మాణం కోసం నిధులు మంజూరైన కాలువ నిర్మాణం పూర్తి కాకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని, దీనిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వచ్చే సంవత్సరం నాటికి కాలువ నిర్మాణాన్ని పూర్తి చేయించి సాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

ఎన్నికల ముందు ప్రకటించిన విధంగా ఆరు గ్యారంటీలలో ఇప్పటికే నాలుగు గ్యారంటీలను అమలు చేయడం జరిగిందని, ఇందిరమ్మ ఇండ్ల కోసం,మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్థిక సాయం కోసం రేపు ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగే మంత్రివర్గ సమావేశంలో ఆమోదముద్ర వేసి అందించడం జరుగుతుందని అన్నారు. గతంలో కొందరు రాజకీయాల కోసం సంక్షేమ పథకాలు అందకుండా చేశారని,పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని అన్నారు. రైతు భరోసా పథకం ద్వారా మిగిలిన రైతులకు కూడా డబ్బులు జమ చేయడం జరుగుతుందని, రైతులు ఎలాంటి అపోహలు పడొద్దు అని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేయడం జరుగుతుందని, ఎవరు కూడా ఇండ్ల కోసం పైరవీకారులను ఆశ్రయించవద్దని డబ్బులు కూడా ఇవ్వవద్దని సూచించారు.

గుడిసెలో నివాసం ఉంటూ సెంటు భూమి కూడా లేని వారిని మొదటగా గుర్తించి గ్రామాలలోని రచ్చ కట్టల వద్ద నిజమైన లబ్ధిదారులను స్వయంగా తానే గుర్తించి వారికే ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు.గత ప్రభుత్వంలో నియోజకవర్గంలో కళ్యాణ లక్ష్మి. ఆరోగ్యశ్రీ పథకాలలో కొందరు బోగస్ పత్రాలు సమర్పించి డబ్బులు పొందాలని అటువంటి వారిని గుర్తించి చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. మళ్లీ ఇటువంటివి పునరావృతం కాకుండా గ్రామాలలో నాయకులు కార్యకర్తలు జాగ్రత్తగా వ్యవహరించాలని, పెండింగ్లో ఉన్న భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకుంటుందని అన్నారు. అనంతరం  గ్రామాల వారిగా పార్టీ నాయకులు కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించారు.కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గోదల బీరయ్య,పాన్గల్ సింగల్ విండో మాజీ చైర్మన్ బాల్ రెడ్డి, మాజీ సర్పంచ్ లు గంగిరెడ్డి,రవిందర్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నారాయణరెడ్డి, రఘునాథ్ రెడ్డి,వాలా మదన్మోహన్రావు, బొల్లారం సుదర్శన్ రెడ్డి, రామిరెడ్డి, లోడుగు రాజు,రాంబాబు వెంకట్ రెడ్డి,గోపి,విష్ణు, సారంగం జయప్రకాష్, నరసింహ, తదితరులు ఉన్నారు.