నేడు కొల్లాపూర్ కు మంత్రి జూపల్లి రాక

నేడు కొల్లాపూర్ కు మంత్రి జూపల్లి రాక

ముద్ర.కొల్లాపూర్:-తెలంగాణ ప్రజా ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం నేడు మధ్యాహ్నం 03:00 గంటలకు మొదటిసారిగా కొల్లాపూర్ నియోజకవర్గానికి రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు రానున్నారు.ఈ సందర్భంగా కొల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో కొల్లాపూర్ పట్టణంలో నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు భారీ ఎత్తున విజయోత్సవ ర్యాలీని నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల,గ్రామాల ప్రస్తుత మాజీ ప్రజాప్రతినిధులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు నియోజకవర్గ ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కోరారు.