శ్రీరంగాపూర్ రంగసముద్రం నుంచి సాగునీటిని విడుదల చేసిన మంత్రి జూపల్లి
ముద్ర.వీపనగండ్ల:- రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగునీటిని అందించడం జరుగుతుందని రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బుధవారం శ్రీరంగాపూర్ రంగసముద్రం నుంచి భీమా పేస్ టూ కు అవుట్ ఫర్ రెగ్యులేటర్ వద్ద పూజలు నిర్వహించి దిగువకు నీటిని వదిలారు. రైతులు సాగినీటిని వృధా చేయకుండ పంట పొలాలకు వాడుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో బీమా ఎస్సీ సత్య శీలారెడ్డి, ఈఈ కేశవరావు, డిఈ లు రాజ్ కుమార్, కిరణ్, ఏఈ లు కిషోర్,దేవరాజ్, నాగర్ కర్నూల్ జిల్లా పర్యాటకశాఖ అధికారి కల్వరాల నరసింహ, వీపనగండ్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గోదల బీరయ్య, పానగల్ సింగిల్ విండో మాజీ అధ్యక్షులు బాల్ రెడ్డి, వీపనగండ్ల మండలం రైతు సమన్వయ సమితి మాజీ అధ్యక్షులు నారాయణరెడ్డి, ఎత్తం కృష్ణయ్య, కొల్లాపూర్ మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ రామచంద్రారెడ్డి, పానగల్ మాజీ జడ్పిటిసి కేతపల్లి రవి, మాజీ సర్పంచ్ గంగిరెడ్డి, కిసాన్ సెల్ మండల అధ్యక్షులు వెంకటరెడ్డి, నాయకులు బొల్లారం సుదర్శన్ రెడ్డి, బీచుపల్లి యాదవ్, చక్ర వెంకటేష్, వెంకట్ రాజయ్య, కోటిరెడ్డి, గురుక కురుమయ్య, బిజ్జు నరేష్ తదితరులు ఉన్నారు.