మంత్రి కోమటిరెడ్డి పిర్యాదుతోనే ఎన్ కన్వెన్షన్ కూల్చివేతే
హైదరాబాద్ లో సినీ నటుడు నాగార్జున కు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేతకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కారణమని తెలుస్తోంది. ఎన్ కన్వెన్షన్ అక్రమణాలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫిర్యాదు చేయడంతోనే హైడ్రా రంగంలోకి దిగింది. ఈనెల 21వ తేదీన ఎన్ కన్వెన్షన్ ఆక్రమణల పై హైడ్రా లేఖ రాశారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. గూగుల్ మ్యాప్, FTL ఆధారంగా ఎన్ కన్వెన్షన్ కట్టడం ఆక్రమణ గురైనట్లు మంత్రి ఫిర్యాదు చేశారు. మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఫిర్యాధు మేరకు విచారణ చేసిన హైడ్రా.. అన్ని శాఖల అధికారుల నుంచి నివేదికలు తెప్పించుకొని యాక్షన్ లోకి దిగింది. అక్కినేని నాగార్జున కు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ ను పూర్తిగా కూల్చివేస్తోంది.