దుర్గకు  అండగా మంత్రి కోమటి రెడ్డి మంత్రి కోమటిరెడ్డి రూ.1లక్ష ఆర్థిక సాయం

దుర్గకు  అండగా మంత్రి కోమటి రెడ్డి మంత్రి కోమటిరెడ్డి రూ.1లక్ష ఆర్థిక సాయం

ముద్ర ప్రతినిధి, నిర్మల్:నిర్మల్ జిల్లా తానూర్ మండలం బెల్తరోడ గ్రామానికి చెందిన దుర్గ   తదండ్రులను కోల్పోయి అనాథగా మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో  నేనున్నానని భరోసా కల్పించారు రాష్ర్టమంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. తన కుమారుడు ప్రతీక్ పేరుతో నిర్వహిస్తున్న  ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా  లక్ష రూపాయలను తహసీల్దార్ లింగమూర్తి, ఎం పి డి ఓ అబ్దుల్ సమద్ ల  ద్వారా పాపకి అందించారు.  

అనంతరం పాప దుర్గతో వీడియో కాల్ లో మాట్లాడారు. ఆర్థికంగా చేయూతను అందించడంతో  పాటు చిన్నారి విద్యాభ్యాసం పూర్తయ్యే వరకు చదివిస్తానని అన్ని సౌకర్యాలు కల్పిస్తూ పెళ్ళి అయ్యేవరకు బాధ్యత వహిస్తానని వెల్లడించారు.ప్రతి నెల ఖర్చుల కోసం పంపుతానని, త్వరలో పాపను కలుస్తానని అన్నారు. ఉండేందుకు ఇల్లు కూడా కట్టిస్తానని వెల్లడించారు. అధైర్యపడవద్దని, నేనున్నానని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ సభ్యులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.