హోంగార్డు కిషోర్  కుటుంబానికి మంత్రి కోమటిరెడ్డి 2 లక్షల ఆర్థిక సహాయం

హోంగార్డు కిషోర్  కుటుంబానికి మంత్రి కోమటిరెడ్డి 2 లక్షల ఆర్థిక సహాయం

ముద్ర ప్రతినిధి, నల్గొండ:నల్గొండ జిల్లా నార్కట్ పల్లి పోలీస్ స్టేషన్ లో హోంగార్డుగా పనిచేస్తు మర్రిగూడ బైపాస్ వద్ద మంగళవారం బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ సందర్భంగా ట్రాఫిక్ క్లియర్ చేస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మెరుగు నవ కిషోర్ కుటుంబానికి రాష్ట్ర రోడ్లు, భవనాలు, సీమటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రూ.2 లక్షల ఆర్థిక సహాయం అందజేశారు. నవ కిషోర్ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బుధవారం అన్నేపర్తిలోని మెరుగు నవ కిషోర్ పార్దివదేహాన్ని నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం సతీమణి వేముల పుష్ప, నల్లగొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, నల్గొండ జడ్పిటిసి వంగూరి లక్ష్మయ్యలు సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పంపిన రూ. 2 లక్షల నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ఆంగోతు ప్రదీప్ నాయక్, చిన్నాల జానయ్య తదితరులు పాల్గొన్నారు.