నూతన సచివాలయంలో పూజలు నిర్వహించిన మంత్రి కొప్పుల 

నూతన సచివాలయంలో పూజలు నిర్వహించిన మంత్రి కొప్పుల 

మంత్రిని కలిసి అబినంధించిన జగిత్యాల, పెద్దపల్లి  జిల్లా ప్రజా ప్రతినిధులు
ముద్ర ప్రతినిధి, జగిత్యాల:  డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ నూతన సచివాలయంలో‌ని తన చాంబర్ లో  ఎస్సీ అభివృద్ధి మైనారిటీ సంక్షేమ శాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్   ప్రత్యెక  పూజలు  నిర్వహించి ఎస్సీ సబ్ ప్లాన్ ఫైల్ పై సంతకం చేశారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ నూతన ఛాంబర్ లో సతీమణి స్నేహలత, కూతురు నందిని, అల్లుడు అనిల్ కుమార్, మనవడు భవానీ నిశ్చల్ తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి బాధ్యతలు స్వీకరించారు.  

ఈ సందర్బంగా జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలకు చెందిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లా పరిషత్ అధ్యక్షులు  దావ వసంత సురేష్, పుట్ట మధుకర్, యంపి వెంకటేష్ నేత, ఎమ్మెల్సీ ఎల్. రమణ, రాష్ట్ర పోలీస్ హోసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటీ దామోదర్ గుప్తా, ఉమ్మడి కరీంనగర్ డి.సి.ఎం.ఎస్. చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, రామగుండం మేయర్ అనిల్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల గ్రంథాలయ సంస్థల చైర్మన్లు డా. గొల్లపల్లి చంద్ర శేఖర్ గౌడ్, రఘువీర్ సింగ్, రాష్ట్ర బిఆర్ఎస్ నాయకులు ఓరుగంటి రమణ రావు, బుగ్గారం జెడ్పీటీసీ బాధినేని రాజేందర్, నందిమేడారం పాక్స్ చైర్మన్ బలరాం, జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ మంద మకరంద్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలకు చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు మంత్రిని కలిసి అబినంధించారు.