జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ ఎస్పీ అధికారులతో ఫోన్ లో మాట్లాడిన మంత్రి సత్యవతి రాథోడ్ ప్రస్తుత పరిస్థితులపై సమీక్షించారు.

  • మంత్రి ఆదేశాలతో రంగంలోకి దిగిన అధికారులు రెస్క్యూటిమ్,NDRF బృందాలు మొరంచపల్లి గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకున్న 200 మందిని సురక్షిత ప్రాంతాలకు చేర్చారు.

ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ గారు మాట్లాడుతూ...

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మొరంచపల్లి గ్రామంలో వరదలో చిక్కుకున్న 200 మందిని సురక్షిత ప్రాంతాలకు చేర్చడం జరిగిందని రాష్ట్ర గిరిజన, స్త్రీ - శిశు సంక్షేమ శాఖల మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు అన్నారు. ఇంకా  సహాయక చర్యలు కొనసాగుతున్నాయని మంత్రి స్పష్టం చేశారు.  రెస్యూ  చేసిన వారందరినీ కరకపల్లి విలేజ్ లోని పునరవాస కేంద్రాలకు తరలించామని వారికి ప్రైమరీ హెల్త్ సెంటర్ ఏర్పాటుచేసి వైద్య చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. పునరావాస కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేసామని, ఆహారం, నీరు, దుస్తులు, దుప్పట్లు, మందులను ఏర్పాటు చేసి వారికి అధిస్తున్నామని తెలిపారు. ఉదయం వాతావరణం అనుకూలించకపోవడంతోని హెలికాప్టర్ ద్వారా రక్షణ చర్యలు చేపట్టలేకపోయామని కొంత ఆలస్యం జరిగిందని, ఇప్పుడు హెలికాప్టర్లు  చేరుకున్నాయని, ఇండ్లపై, చెట్లపై  వరదల్లో చిక్కున్న వారందరిని రక్షిస్తామని మంత్రి స్పష్టం చేశారు. గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ గారి ఆదేశాలతో  ప్రజాప్రతినిధులు,అధికారులు మేమంతా అండగా ఉన్నామని ఎవరు అధైర్య పడద్దని మంత్రి తెలిపారు.ఇలాంటి పరిస్థితుల్లోనూ కొంత మంది విమర్శలు చేయడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నాని అన్నారు మంత్రి. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు బాధితుల మనోధైర్యం దెబ్బతీసే విధంగా వ్యవహరించడం సరికాదని అన్నారు. ఇలాంటి సమయంలో ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించి సహాయక చర్యల్లో సహకరించాలని మంత్రి ప్రతిపక్షాలకు పిలుపునిచ్చారు.