సాగునీటి ప్రాజెక్టు లను నూటికి నూరు శాతం పూర్తి చేసి తీరుతాం - మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
ముద్ర ప్రతినిధి, వనపర్తి : తెలంగాణ రాష్ట్రం లోని సాగునీటి ప్రాజెక్టు లను నూటికి నూరు శాతం పూర్తి చేసి తీరుతామని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. బుధవారం రాష్ట్ర నీటి పారుదల శాఖ, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి, ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణా రావు, ఎమ్మెల్యే లు మధు సుధన్ రెడ్డి, తూడి మేఘా రెడ్డి, నీటి పారుదల శాఖ రాష్ట్ర స్థాయి అధికారులు లతో కలిసి వనపర్తి జిల్లా కొత్త కోట మండలం కానాయపల్లి గ్రామంలోని శంకర సముద్రం రిజర్వాయర్ ను పరిశీలించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర నీటి పారుదల, రెవెన్యూ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉమ్మడి పాలమూరు జిల్లా లోని పురోగతిలో ఉన్న,పెండింగ్ లో ఉన్న పాలమూరు రంగారెడ్డి, రాజీవ్ గాంధీ భీమా, మహాత్మా గాంధీ, జవహర్ నెట్టంపాడు, కోయల్ సాగర్, గట్టు వంటి నూతన సాగునీటి ప్రాజెక్టు లను నూటికి నూరు శాతం పూర్తి చేస్తామని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. రాజీవ్ భీమా సాగునీ టి ఎత్తిపోతల పథకం లోని శంకర సముద్రం అర్ అండ్ అర్ సమస్యలను పరిష్కరిస్తామనీ తెలిపారు.జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి,ఇరిగేషన్ శాఖ అధికారులు పునరావాస కేంద్రాల ఏర్పాటు, సాగునీటి కాలువల నిర్మాణానికి అయ్యే వ్యేయం, ఎంత ఆయకట్టు కు నీరు అందించగలం మన్నా పూర్తి నివేదికలను సమర్పించాలని మంత్రి ఆదేశించారు.
నివేదికలు అందిన వెను వెంటనే నిధులను మంజూరు చేసి సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో దేవరకద్ర శాసనసభ్యులు మధు సుధన్ రెడ్డి,వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘా రెడ్డి,ఆర్థిక శాఖ కార్యదర్శి రామకృష్ణ రావు, సాగునీటి పారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ఈఎన్ సి (జనరల్)అనీల్ కుమార్, ఎస్ ఈ శ్రీనివాస్ రెడ్డి, ఈఈ కేశవ్ రావు,మధుసూదన్ రెడ్డి, డీ ఈ ఎల్ల స్వామీ, ఏ.ఈ అఖిల్, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.