కాళేశ్వరం ప్యాకేజీ 22 పనులపై మంత్రి ఉత్తమ్ సమీక్ష
ముద్ర ప్రతినిధి, కామారెడ్డి: తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి కార్యాలయంలో ఎల్లారెడ్డి నియోజకవర్గానికి సంబంధించిన కాళేశ్వరం ప్యాకేజీ 22 పనులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఎలారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ సమీక్ష నిర్వహించారు.
భూంపల్లి, కాటేవాడి, మోతే, ప్రాంతలలో రిజర్వాయర్ నిర్మాణ పనులు చేపట్టాలని ఎమ్మెల్యే మదన్ మోహన్ కోరారు. ఈ పనులు పూర్తి అయితే లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని ఎమ్మెల్యే మదన్ మోహన్ నీటిపారుదల శాఖ మంత్రికి తెలిపారు. ఈ సమావేశంలో ఇంజనీర్ చీఫ్ అనిల్, ప్రిన్సిపాల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా, ఇరిగేషన్ శాఖ అధికారులు పాల్గొన్నారు.