చండీయాగంలో మంత్రి దంపతులు

చండీయాగంలో మంత్రి దంపతులు

 ముద్ర ప్రతినిధి, వనపర్తి : వనపర్తి మండలం రాజనగరం గ్రామంలోని రామకృష్ణ ఈశ్వర స్వామి ఆలయంలో ఆదివారం నిర్వహించిన చండీయాగం లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఆయన సతీమణి వాసంతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి దంపతులు స్వయంగా లక్ష రూపాయలు ఆలయ అభివృద్ధికి ప్రకటించారు. అలాగే తన ఎమ్మెల్యే నిధుల నుండి 5 లక్షల రూపాయలు అందజేస్తామని హామీ ఇచ్చారు. చండీయాగంలో పూజలు నిర్వహించారు.