కేటీఆర్ ను కలిసిన మంత్రి పట్నం

కేటీఆర్ ను కలిసిన మంత్రి పట్నం

ముద్ర ప్రతినిధి, రంగారెడ్డి : రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావుని  రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, గనుల శాఖ మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి  కలిశారు. ఇటీవల పట్నం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి  బాధ్యతలను స్వీకరించిన విషయం విధితమే.  ఈ తరుణంలో కేటీఆర్ విదేశీ పర్యటనలో ఉన్నారు. విదేశాల నుంచి తిరిగి వచ్చిన కేటీఆర్ ను మహేందర్ రెడ్డి గురువారం  ఆయన స్వగృహంలో కలిశారు.