కవులు, క‌ళాకారుల‌కు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో సమున్నత స్థానం క‌ల్పిస్తాం :–మంత్రి జూప‌ల్లి కృష్ణారావు

కవులు, క‌ళాకారుల‌కు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో సమున్నత స్థానం క‌ల్పిస్తాం  :–మంత్రి జూప‌ల్లి కృష్ణారావు
  • గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన కూచిపూడి నృత్యం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన మంత్రులు జూపల్లి,సీతక్క

ముద్ర.కొల్లాపూర్:-క‌వులు, క‌ళాకారులు, సాహితివేత్త‌ల‌కు త‌గిన గుర్తింపు ఇవ్వ‌డంతో పాటు   వారికి సంపూర్ణ స‌హకారం అందించేందుకు కొత్త‌గా ఏర్ప‌డ్డ కాంగ్రెస్ ప్ర‌భుత్వం  కృషి చేస్తుంద‌ని రాష్ట్ర ఎక్సైజ్, ప‌ర్యాట‌క, సాంస్కృతిక మరియు పురావ‌స్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.గ‌చ్చిబౌలి స్టేడియంలో  భార‌త్ అర్ట్స్ అకాడ‌మీ ఆద్వ‌ర్యంలో  కూచిపూడి క‌ళాకారుల‌తో చిన్నారులు త‌మ‌ మ‌హా బృంద నాట్యంతో  గిన్నిస్ వ‌ర‌ల్డ్ రికార్డ్స్ సాధించారు. చిన్నారుల నృత్యం చూప‌రుల‌ను ఆక‌ట్టుకుంది.

ఈ కార్య‌క్ర‌మానికి రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, సీత‌క్క  ముఖ్య అతిధులుగా హాజ‌ర‌య్యారు. కూచిపూడి క‌ళారంగంలో విశేష సేవ‌లందిస్తున్న ప‌లువురు కళాకారులను సత్కరించి, సేవలను కొనియాడారు.ఈ సంద‌ర్భంగా  మంత్రి జూప‌ల్లి కృష్ణారావు మాట్లాడుతూ సీయం రేవంత్ రెడ్డి సార‌ద్యంలోని కాంగ్రెస్  ప్ర‌భుత్వం తెలంగాణ సాహితీ సౌరభ వికాసానికి  కృషి చేస్తుంద‌ని,  ప్రతిభ కలిగిన కళాకారులకు పురస్కారాలు ప్రోత్సాహకాన్ని అందిస్తామ‌న్నారు.కార్యక్రమానికి విచ్చేసిన మంత్రులు జూపల్లి,సీతక్క ను భారత్ ఆర్ట్స్ అకాడమీ అధ్వర్యంలో కార్యక్రమ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు.