పేద ప్రజల సంక్షేమమే మోడీ సర్కార్ ధ్యేయం - ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి

పేద ప్రజల సంక్షేమమే మోడీ సర్కార్ ధ్యేయం - ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, నిర్మల్:పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పని చేస్తోందని, ఇందులో భాగంగా పలు కార్యక్రమాలు చేపడుతోందని నిర్మల్  శాసన సభ్యులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "వికసిత భారత్ సంకల్ప యాత్ర" కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో సారంగాపూర్ మండలం దుప్యతండాలో  ప్రధాని నరేంద్ర మోడీ  వికసిత్ భారత్ లబ్ధిదారుల వీడియో కాన్ఫరెన్స్ ప్రసంగాన్ని వర్చువల్గా గ్రామ ప్రజల సమక్షంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని చేపట్టారని, దీనిని ప్రతీ ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.  

కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రతీ మారుమూల గ్రామాలకు చేరువయ్యేలా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం, మోడీకి పేద ప్రజలపై ఉన్న ప్రత్యేక శ్రద్ధకు నిదర్శనమని అన్నారు. అర్హులైన పేద ప్రజలు ప్రతీ ఒక్క సంక్షేమ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అభివృద్ధి చెందిన దేశం గా ప్రపంచ స్థాయిలో అన్ని రంగాల్లో మన దేశం ముందు వరుసలో ఉండటానికి మోడీ సుపరిపాలనే నిదర్శనం అని కొనియాడారు. అధికారులు స్థానికంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగాలను పరిశీలించారు. ప్రతీ విభాగం పై ప్రజలకు వివరణ ఇవ్వాల్సిందిగా అధికారులను ఆదేశించారు.  ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు  అంజుకుమార్ రెడ్డి, నాయకులు నల్లా ఇంద్రకరణ్ రెడ్డి,రావుల రాంనాథ్, అయ్యన్న గారి భూమయ్య, ముత్యం రెడ్డి, విలాస్, రాంశంకర్ రెడ్డి, సరికెల గంగన్న, హరీష్ రెడ్డి, గంగారెడ్డి, కేవ్లా నాయక్, నారాయణ, ప్రకాష్, రవి, శ్రీకాంత్ రెడ్డి, ముత్యం, భూమారెడ్డి, దయాకర్ రెడ్డి,రాజు, దశరథ్,దావోజి తదితరులు పాల్గొన్నారు