కోటి ఇళ్లకు ఉచిత విద్యుత్​

 కోటి ఇళ్లకు ఉచిత విద్యుత్​
  • ‘సూర్య ఘర్​’ను ప్రారంభించిన మోడీ

న్యూఢిల్లీ : సౌర విద్యుత్ వినియోగాన్ని మరింత విస్తరించి సామాన్య పౌరులపై కరెంట్ చార్జీల భారం తగ్గించేందుకు వీలుగా కేంద్రం ‘పీఎం సూర్య ఘర్: ముఫ్త్ బిజ్జీ యోజన’ పథకాన్ని మంగళవారం ప్రారంభించింది. ఈ మేరకు ప్రధాని నరేంద్రమోడీ ప్రకటన చేశారు. ఇందుకోసం సంబంధిత వెబ్​సైట్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ‘మరింత స్థిరమైన అభివృద్ధి, ప్రజల శ్రేయస్సు కోసం ‘పీఎం సూర్య ఘర్: ముఫ్త్ బిజ్లి యోజన’ పథకాన్ని ప్రారంభిస్తున్నాం. రూ.75 వేల కోట్ల పెట్టుబడితో తీసుకొస్తున్న ఈ ప్రాజెక్ట్.. ప్రతినెలా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్​ను అందించి కోటి కుటుంబాల్లో వెలుగులు నింపాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. దీని కింద అందించే సబ్సిడీలను నేరుగా ప్రజల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తాం’ అని ప్రధాని మోడీ ట్విటర్ లో వెల్లడించారు. ఇందుకోసం pmsuryaghar.gov.in లో దరఖాస్తు చేసుకోవచ్చని మోడీ వెల్లడించారు.