ఎంపీ నిధులతో సిసి రోడ్డు ప్రారంభం

ఎంపీ నిధులతో సిసి రోడ్డు ప్రారంభం
  • పట్టణ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున్

ముద్ర ప్రతినిధి, హుజూర్ నగర్: గతంలో నల్లగొండ ఎంపీగా పని చేసిన ప్రస్తుత రాష్ట్ర నీటిపారుదల గృహ నిర్మాణ శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలోని ఒకటవ వార్డు దద్దనాల చెరువులో పర్యటించినప్పుడు అధ్వానంగా ఉన్న వీధిని చూసి తన పార్లమెంటు పరిధిలోని నిధులను 1 వ వార్డులో సిసి రోడ్డుకు కేటాయించారని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున్ అన్నారు. శుక్రవారం ఎంపీ నిధులతో మంజూరైన సిసి రోడ్డు పనులను బూత్ ఇంచార్జ్ సభ్యులతో కలిసి పట్టణ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.

అనంతరం పట్టణ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున్ మాట్లాడుతూ అభివృద్ధి ప్రదాత ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్ర మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నందున హుజూర్ నగర్ నియోజకవర్గం అభివృద్ధి పనులలో ముందంజలో ఉంటుందని గతంలో కూడా ఆయన మంత్రిగా పనిచేసినప్పుడు నియోజకవర్గంలో ఎంతగానో అభివృద్ధి జరిగిందని తొందరలోనే మున్సిపాలిటీ పాలకవర్గం గుంతలతో కూడిన హుజూర్ నగర్ మెయిన్ రోడ్డు పనులను కూడా పూర్తి చేస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఒకటవ వార్డు కౌన్సిలర్ కొమ్ము శ్రీనివాస్, నందిగామ శ్రీనివాస్, తమ్మిశెట్టి రాము, తమ్మిశెట్టి రవి ,హనీఫ్ ,పింగళి ఆంజనేయులు, వేముల వెంకన్న మహిళా సభ్యులు పాల్గొన్నారు.