మెగాస్టార్‌తో.. మృణాల్‌

మెగాస్టార్‌తో.. మృణాల్‌

మెగాస్టార్ చిరంజీవి చాలా స్పీడు మీదున్నారని చెప్పాలి. వరుసగా ఒకటి తరువాత ఒకటి సినిమాలు చేస్తున్నారు. ఈ యేడాది మొదట్లోనే ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ సక్సెస్ అందుకున్నాడు. అయితే ఆ సక్సెస్ అందుకున్న కొన్ని నెలలకే మళ్లీ ‘భోళా శంకర్’తో ఊహించని విధంగా కెరీర్ లోనే మరో బిగ్గెస్ట్ డిజాస్టర్ చూడాల్సి వచ్చింది. కాస్త గ్యాప్ తీసుకున్న మెగాస్టార్ మళ్లీ బౌన్స్ బ్యాక్  అయ్యేవిధంగా ప్రాజెక్టును సిద్ధం చేసుకుంటున్నాడు.  ఈసారి ఏకంగా సోషియో ఫాంటసీ అడ్వెంచర్ మూవీతో సప్రైజ్ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. దర్శకుడు వశిష్ట చిరంజీవికి ఇది వరకే  మొయిన్‌ కథ చెప్పిన విషయం తెలిసిందే. ఆ లైన్ వినగానే ఇంప్రెస్ అయిన ఆయన పూర్తి తరహాలో పర్ఫెక్ట్ గా స్క్రిప్ట్ రెడీ చేయమని సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా మెగాస్టార్‌కి జోడిగా మొదటి ఆప్షన్ గా ‘సీతారామం’ బ్యూటీ మృణాల్ ఠాగూర్ ను అనుకుంటున్నట్లుగా సమాచారం. ఆమె అయితే ఈ కథకు పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందని దర్శకుడు కూడా తన ఆలోచనలు మెగాస్టార్ ముందు పెట్టినట్లుగా తెలుస్తోంది.