కాంగ్రెస్ కే ముదిరాజ్ ల మద్దతు

కాంగ్రెస్ కే ముదిరాజ్ ల మద్దతు
  • తెలంగాణ ఫిషరీస్ సొసైటీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు మాల కనకయ్య ముదిరాజ్

ముద్ర ప్రతినిధి కరీంనగర్ :కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఉన్న ముదిరాజుల మద్దతు కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు కే అని తెలంగాణ ఫిషరీ సొసైటీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు మాల కనకయ్య ముదిరాజ్ స్పష్టం చేశారు. ప్రెస్ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలోతెలంగాణ మత్స్యకారుల విభాగం రాష్ట్ర అధ్యక్షులు నగేష్ ముదిరాజు తో కలిసి ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ముదిరాజ్ లకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేశారని, బీసీ డీ నుండి బీసీ ఏ గ్రూపులోకి మార్చుతామంటూ ప్రకటన చేయడం, ముదిరాజ్ లకు రాష్ట్ర కేబినెట్ లో స్థానం కల్పిస్తామని స్పష్టమైన హామీ ఇస్తూ ముదిరాజ్ సమాజానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండగా నిలిచారని పేర్కొన్నారు. మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల ప్రత్యేక అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తామని రాష్ట్ర, జిల్లా స్థాయి కార్పొరేషన్ పదవులలో సమచితస్థానం కల్పిస్తామని సీఎం స్పష్టమైన హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు ను గెలిపించుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పెసరు కుమారస్వామి, నాయకులు అయితరవేని కొమరయ్య, మహేందర్, బోయిని వెంకటేష్ తో పాటు పలువురు పాల్గొన్నారు.