శ్రీనివాస్ రెడ్డికి ముద్ర జర్నలిస్టుల అభినందనలు

శ్రీనివాస్ రెడ్డికి ముద్ర జర్నలిస్టుల అభినందనలు

ముద్ర న్యూస్ బ్యూరో: హైదరాబాద్: రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్​ గా నియమితులైన ఇండియన్​ జర్నలిస్ట్స్​ యూనియన్​ (ఐజేయు)
అధ్యక్షులు కె.శ్రీనివాస్​ రెడ్డిని ‘ముద్ర’ దినపత్రిక బృందం మంగళవారం హైదరాబాద్​ లోని బషీర్​ బాగ్​ ప్రెస్​ క్లబ్ లో మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలు తెలిపింది. ఈ  సందర్భంగా ముద్ర ఎడిటర్​ వై.నరేందర్​ రెడ్డి, ఎగ్జిక్యూటివ్​ ఎడిటర్​ ఎలిమినేటి ఇంద్రారెడ్డి.. శ్రీనివాస్​ రెడ్డికి  శాలువా కప్పి, పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. వివిధ విభాగాల ఇంఛార్జీలు, పాత్రికేయులు పాల్గొన్నారు.