రెండు హామీలతో పేదలకు ప్రయోజనం - మునిసిపల్ చైర్మన్ ఈశ్వర్

రెండు హామీలతో పేదలకు ప్రయోజనం  - మునిసిపల్ చైర్మన్ ఈశ్వర్

ముద్ర ప్రతినిధి, నిర్మల్:రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండు హామీలతో పేదలకు ప్రయోజనం కలుగుతుందని నిర్మల్  మునిసిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని జిల్లా  ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రిలో రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10 లక్షల చేయూత పథకాన్ని ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా నిరుపేదలకు ఉచితంగా నాణ్యమైన కార్పొరేట్ వైద్యం అందుతుందని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం అందించే ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.అనంతరం ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రయాణ ప్రాంగణంలో శ్రీ మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించి బస్సులో మహిళలతో కలిసి ప్రయాణించారు.శ్రీ మహాలక్ష్మి పథకం ద్వారా తెలంగాణ రాష్ట్రం లో మహిళలు ఎక్కడి నుండి ఎక్కడికైనా పల్లె వెలుగు,సిటీ ఆర్డినరి ,సిటీ మెట్రో  లో ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో కమిషనర్ సి.వి.ఎన్ రాజు, జడ్పిటిసి పత్తి రెడ్డి రాజేశ్వర్ రెడ్డి, ఆస్పత్రి సూపరింటెండెంట్ డా.సునీల్, డీ ఎం హెచ్ ఓ ధన్ రాజ్, కమిషనర్ రాజు తదితరులు ఉన్నారు.