బీజేపీ నాయకుల బూటకపు మాటలు ప్రజలు నమ్మవద్దు.

బీజేపీ నాయకుల బూటకపు మాటలు ప్రజలు నమ్మవద్దు.
  • మున్సిపల్ చైర్మన్ నల్మాస్ కాంతయ్య.

ముద్ర, లక్షెట్టిపేట: బీజేపీ నాయకుల బూటకపు మాటలు ప్రజలు నమ్మవద్దు అని మున్సిపల్ చైర్మన్ నల్మాస్ కాంతయ్య అన్నారు. శుక్రవారం స్థానిక మున్సిపల్ కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ నల్మాస్ కాంతయ్య మాట్లాడుతూ...టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేకనే బిజెపి ప్రభుత్వం అవాకులు చివాకులు పేలుతున్నారని మండిపడ్డారు. ఈరోజు డబుల్ బెడ్ రూమ్ ల పేరుతో బీజేపీ నాయకులు ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉండి కూడా రైతులు పండించిన పంటలను కొనలేదని ఎన్నికలు సమీపిస్తున్న వేళ  ప్రజలను మభ్యపెట్టే   బిజెపికి తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాత్రమే సాధ్యపడుతుందని అన్నారు.అంతకుముందు బీ ఆర్ ఎస్ పట్టణాధ్యక్షుడు పాదం శ్రీనివాస్ మాట్లాడుతూ....గత అసెంబ్లీ ఎన్నికల్లో 100 స్థానాల్లో డిపాజిట్ కూడా పొందని బీజేపీ డబల్ బెడ్ రూమ్ లు ఇస్తామనడం సిగ్గు చేటన్నారు. అభివృద్ధి గిట్టని బీజేపీ కి కర్ణాటక లో పట్టిన గతి తెలంగాణ లో కూడా పడుతుందన్నారు. అనంతరం కౌన్సిలర్ శాతరాజు రాజన్న మాట్లాడుతూ 9 ఏండ్లు అధికారం లో  ఉన్నటువంటి బీజేపీ కి ఇన్ని రోజులు డబల్ బెడ్ రూమ్ లు గుర్తుకు రాలేదా? అని ఏద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు షాహిద్ అలీ, నూనె ప్రవీణ్,మాజీ ఎంపీపీ కట్ల చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.