చిలుకూరు పిఎసిఎస్ ను సందర్శించిన నాబార్డ్ బృందం

చిలుకూరు పిఎసిఎస్ ను సందర్శించిన నాబార్డ్ బృందం

చిలుకూరు, ముద్ర  :చిలుకూరు పిఎసిఎస్ ను బుధవారం నాబార్డ్ అధికారులు సందర్శించారు,ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో పిఎసిఎస్ లు అన్ని కంప్యూటర్ కరుణ అయినవేనని పిఎసిఎస్ చిలుకూరు దీర్ఘకాలిక స్వల్పకాలిక మరియు బంగారు ఆభరణముల తాకట్టుపై లోన్స్ ఇవ్వడము ఉమ్మడి జిల్లాలో మొదటి స్థానంలో ఉన్నది, పిఎసిఎస్ చిలుకూరు పూర్తి కంప్యూటర్ కరుణ చెంది ఉన్నది ఇంకా అభివృద్ధి పదంలో  నడపడానికి నాబార్డ్ నుంచి నిధులను ఏర్పాటు చేస్తామని వారు హామీ ఇచ్చారు, రైతులకు ఉపయోగపడే సేవలను అందించాలని కోరారు, ఈ కార్యక్రమంలో నాబార్డ్ డిప్యూటీ జనరల్ మేనేజర్ సోమనాథ్ పట్రాజి, జిల్లా డెవలప్మెంట్ మేనేజర్స్ ఎన్ సత్యనారాయణ, ఎం, వినయ్ కుమార్, డిసిసి మేనేజర్ సుధాకర్,ఫీల్డ్ ఆఫీసర్స్,సంఘ అధ్యక్షులు ఏ జనార్దన్, సంఘ కార్యదర్శి సిహెచ్ లక్ష్మీనారాయణ, డైరెక్టర్స్ కే సోమయ్య, కే రాంబాబు, సిబ్బంది పాల్గొన్నారు.