చంద్ర‌బాబు, పవన్ కళ్యాణ్ లకు శుభ‌కాంక్ష‌లు తెలిపిన ఎన్టీఆర్ ….

చంద్ర‌బాబు, పవన్ కళ్యాణ్ లకు శుభ‌కాంక్ష‌లు తెలిపిన ఎన్టీఆర్  ….

ముద్ర,ఆంధ్రప్రదేశ్:-ఆంధ్రప్రదేశ్లో టిడిపి కూట‌మి ఈ చిరస్మరణీయ విజయంపై టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. “ప్రియమైన చంద్రబాబు మామయ్యకి… ఈ చారిత్రాత్మక విజయాన్ని సాధించినందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరు సాధించిన ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపు నడిపిస్తుందని ఆశిస్తున్నాను. అద్భుతమైన మెజారిటీతో గెలిచిన నారా లోకేశ్ కి, మూడోసారి విజయం సాధించిన బాలకృష్ణ బాబాయికి, ఎంపీలుగా గెలిచిన పురందేశ్వరి అత్తకి, మతుకుమిల్లి శ్రీభరత్ కు నా శుభాకాంక్షలు” అంటూ తన బంధువులకు ఎన్టీఆర్ విషెస్ తెలియజేశారు.