మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డి..

మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డి..
  • నవీన్ రెడ్డి పేరును ప్రకటించిన మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్

ముద్ర, షాద్ నగర్:మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డిని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ నాగర్ కుంట నవీన్ రెడ్డి పేరును బీఆర్ఎస్ అధిష్టానం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారు చేశారు.

ఇటీవల కాలంలో కేటీఆర్ సమక్షంలో షాద్ నగర్ నియోజకవర్గంలో గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పార్టీలో చేరిన ఈ యువ నాయకుడు నవీన్ రెడ్డి పేరు మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పేరును ప్రకటించడంతో శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నాగర్ కుంట నవీన్ రెడ్డి ఈ ప్రాంతంలో సంచల నాయకుడిగా పేరు ఉంది. ఇటీవల కాలంలో మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ కు మద్దతుగా నిలిచారు. యువత ఎక్కువ ఫాలోయింగ్ ఉండే నాయకుడిగా కూడా నవీన్ రెడ్డికి గుర్తింపు ఉంది. నియోజకవర్గంలో అన్ని ప్రాంతాల్లో నవీన్ రెడ్డిని గుర్తుపట్టేవారు ఉన్నారు. ఆర్థికంగా, రాజకీయంగా అందరికీ పరిచయస్తుడు.