మంత్రి జూపల్లి కృష్ణారావు కృషి వల్లే రాష్ట్రానికి జాతీయ అవార్డు

మంత్రి జూపల్లి కృష్ణారావు కృషి వల్లే రాష్ట్రానికి జాతీయ అవార్డు
  • నాగర్ కర్నూలు జిల్లా పర్యాటకశాఖ అధికారి కల్వరాల నరసింహ

ముద్ర.వీపనగండ్ల :- రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వల్లే కృష్ణ రాష్ట్రానికి జాతీయ అవార్డు రావడం జరిగిందని నాగర్ కర్నూలు జిల్లా పర్యాటకశాఖ అధికారి కల్వరాల నరసింహ అన్నారు.సోమశిల గ్రామానికి స్పిరిచ్యువల్ - వెల్నెస్ " కేటగిరీలో జాతీయ అవార్డు రావడంతో గతంలో నల్గొండ జిల్లా కలెక్టర్ గా పనిచేసిన సీనియర్ ఐఏఎస్ అధికారి,ఢిల్లీ లోని రెసిడెంట్ కార్యాలయం కమీషనర్ గౌరవ్ ఉప్పల్ ను కలిశారు. నాగర్ కర్నూల్ జిల్లాలోని నల్లముల ప్రాంతమైన సోమశిల గ్రామం పర్యాటకరంగా అభివృద్ధి చెందడంతో జాతీయ అవార్డు  అందుకున్నందుకు కాల్వరాల నరసింహు ను సోమశిల గ్రామస్తులను అభినందించారు.

రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వర్యులు జూపల్లి కృష్ణారావు  చేసిన అభివృద్ది వల్లే నేడు తెలంగాణ రాష్ట్రానికి జాతీయ అవార్డు వచ్చిందని ఈ ఘనత వారికే దక్కుతుందని కేవలం వారి ప్రతినిధిగా Subject అవార్డు అందుకోవడం జరిగింది అని నరసింహ అన్నారు. కార్యక్రమంలో  నిర్మల్ జిల్లా జాయింట్ కలెక్టర్ పైజాన్ అహ్మద్ ఉన్నారు. కల్వరాల నరసింహ జాతీయస్థాయిలో పర్ జాతీయ అవార్డు అందుకోవటం పట్ల మండల ప్రజలు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.