భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి

భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి

రామకృష్ణాపూర్,ముద్ర : శ్రావణమాసం మొదటి సోమవారంతో పాటు నాగుల పంచమి సందర్బంగా రామకృష్ణాపూర్ పట్టణంలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. సోమవారం ఉదయం నుంచే భక్తులు ఆలయాలకు చేరుకొని భక్తి శ్రద్ధలతో పుట్టలో పాలు పోసి,జోడు నాగులను దర్శించుకున్నారు.స్థానిక విజయ గణపతి దేవాలయంలో శ్రావణ సోమవారం సందర్బంగా వేద పండితులు ప్రతిష్టించిన దేవతామూర్తుల విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేశారు.