వీపనగండ్ల ఎస్ఐ గా నందికర్ భాద్యతలు స్వీకరణ

వీపనగండ్ల ఎస్ఐ గా నందికర్ భాద్యతలు స్వీకరణ

ముద్ర.వీపనగండ్ల:-వీపనగండ్ల మండలం నూతన ఎస్సైగా నందికర్ ఆదివారం బాధ్యతలను స్వీకరించారు. ఇక్కడ ఎస్ఐగా పని చేసిన రవి ప్రకాష్ జిల్లా కేంద్రం ఎస్పీ కార్యాలయానికి విఆర్ కు వెళ్లారు. ఎస్సై నందికర్ గద్వాల జిల్లా గట్టు మండలం ఎస్సైగా పనిచేసి బదిలీపై ఇక్కడికి వచ్చారు.ఈ సందర్భంగా ఎస్సై నందికర్ మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.ఎవరైనా చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, యువకులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, వాహనదారులు రోడ్డు నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.