Flood Relief Fund - తెలుగు రాష్ట్రాలకు రూ.2కోట్ల విరాళం ప్రకటించిన నారా భువనేశ్వరి
భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేసాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా వర్షం కురవడం తో భారీ వరదలు ముచ్చేత్తాయి. దీంతో వేలాది ఎకరాలు నీటమునుగగా..వందలు ఇల్లు మునిగాయి. రోడ్లు తెగిపోయి రవాణా వ్యవస్థ స్థంభించింది. ఈ క్రమంలో సాయం కోసం బాధితులు ఎదురుచూస్తున్నారు. రెండు ప్రభుత్వాలు సైతం ఎవరైనా దాతలు సాయం చేయాల్సిందిగా కోరడం తో ప్రతి ఒక్కరు తమకు తోచిన సాయం అందజేస్తూ వస్తున్నారు. తాజాగా వరద బాధితుల సహాయార్థం ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి, హెరిటేజ్ ఫుడ్స్ వైస్ ఛైర్పర్సన్ నారా భువనేశ్వరి విరాళం ప్రకటించారు.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్కు రూ.కోటి చొప్పున ఇస్తున్నట్లు తెలిపారు. ఈ వరదలు ఎంతో మంది జీవితాలపై ప్రభావం చూపించాయని, వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాలకు తమ మద్దతు ఉంటుందని ఆమె పేర్కొన్నారు.