ఈ నెల 28 నుంచి నిర్మల్ లో రసాయన శాస్త్ర జాతీయ సదస్సు

ఈ నెల 28 నుంచి నిర్మల్ లో రసాయన శాస్త్ర జాతీయ సదస్సు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్  ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ఈ నెల  28, 29  తేదీల్లో జాతీయ సదస్సు జరగనుందని ప్రిన్సిపాల్ జాడే బీమారావు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్య అతిథి గా జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ,  ప్రధాన వక్తగా అరింగ్ ప్రొడీవ్, బెంగళూరు సిఇఒ డాక్టర్ రాజేందర్ రెడ్డి హాజరు కానున్నారని తెలిపారు.  "సుస్థిర అభివృద్ధి లో రసాయన, అనుబంధ శాస్త్రాల పాత్ర" అనే అంశం పై రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు వివిధ రాష్ట్రాల విశ్వవిద్యాలయాల, డిగ్రీ కళాశాలల నుండి అధ్యాపకులు తమ పరిశోధన పత్రాలను, వారు కనుగొన్న నూతన ఆవిష్కరణలను సమర్పిస్తారని వివరించారు. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఆర్థిక సహాయంతో జరిగే ఈ సదస్సులో 76 పరిశోధన పత్రాలు అందాయని సదస్సు  సమన్వయ కర్త సరితా రాణి, కో కన్వీనర్ రమాకాంత్ గౌడ్ తెలిపారు.