సాగర్ డ్యాంను పరిశీలిస్తున్న నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ టీం

సాగర్ డ్యాంను పరిశీలిస్తున్న నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ టీం

ముద్ర ప్రతినిధి, నల్గొండ: నేషనల్ డ్యాన్స్ ఎట్టి అథారిటీ బృందం సభ్యులు విజయ విహార అతిథి గృహానికి చేరుకున్నారు. మంగళవారం నాగార్జునసాగర్ డ్యామ్ చేరుకున్న సేఫ్టీ అథారిటీ బృందానికి డ్యాం నీటి పారుదల శాఖ, డ్యాం సూపర్ ఇంజనీరింగ్ నాగేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మల్లికార్జున్ లతోపాటు పలువురు అధికారులు స్వాగతం పలికారు. 13, 14, 15 తేదీల్లో డ్యాము ను పరిచయంలో భాగంగా నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ గత నెల 9న కేంద్ర జలశక్తి కార్యదర్శి జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలులో భాగంగా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నీటి పారుదల శాఖ సంబంధించి 13 మంది బృందం సభ్యులు జలాశయాన్ని సందర్శించి, ప్రాజెక్టును పరిశీలించారు. ఈ పరిశీలనలో భాగంగా నాగార్జున సాగర్ ప్రధాన డ్యాము గేట్లు, గ్యాలరీ, రూప్స్, కుడి కాలువ, హెడ్ రెగ్యులేటర్, జలవిద్యుత్ కేంద్రం, ట్రస్ట్ గేట్లను, 220, 420 గ్యాలరీలను వాక్వే మీద నుంచి స్పిల్ వేను పరిశీలించారు.

సాగర్ జలాశయమును కె ఆర్ ఎం బి పరిధిలోకి తీసుకురానున్న నేపథ్యంలో డ్యాం భద్రత నీటి నిల్వలు వినియోగం పై పూర్తిస్థాయిలో నిపుణుల బృందం అధ్యయనం చేసింది జలాశయ భద్రత నీటి నిల్వలు, నీటి వినియోగం, సమగ్రంగా పరిశీలించి డ్యాం జలాశయ వివరాలను డ్యామ్ నీటిపారుదల శాఖ అధికారులను అడిగి తెలుసు కుంటున్నారు. జలసాయానికి సంబంధించిన గేట్స్, గ్యాలరీ, రూప్స్ ను పరిశీలించి వాటి పనితీరు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ నీటి పారుదల శాఖ అధికారులు, సిఆర్పిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్, నాగార్జునసాగర్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అసిస్టెంట్ కమాండెంట్, ఇరిగేషన్ అధికారులు తదితరులు ఉన్నారు.