స్థానికున్ని.. ఆదరించి..ఆశీర్వదించండి...

స్థానికున్ని.. ఆదరించి..ఆశీర్వదించండి...

ముద్ర, గంభీరావుపేట: స్థానికున్ని, బీసీ బిడ్డగా సిరిసిల్ల నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలు ఆదరించి, ఆశీర్వదించాలని సిరిసిల్ల నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి లగిశెట్టి శ్రీనివాస్ అన్నారు. గంభీరావుపేట మండల కేంద్రంలో ఎన్నికల కార్యాలయాన్ని శ్రీనివాస్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ సిరిసిల్ల నియోజకవర్గంలో ఇంతవరకు బీసీ బిడ్డ ఎమ్మెల్యే కాలేదని అన్నారు. ఏ పార్టీ కూడా సిరిసిల్లాలో బీసీ బిడ్డకు అవకాశం ఇవ్వలేదని, పోటీ చేసే ప్రధాన పార్టీ అభ్యర్థులంతా స్థానికేతరులని అన్నారు. శ్రీనివాస్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నానని, స్థానికున్ని నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తే ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి సేవ చేస్తానని అన్నారు.