తెలుగోడి సత్తా చాటిన ఆస్కార్​

తెలుగోడి సత్తా చాటిన ఆస్కార్​
oscar award for natu natu song

 ఎటు చూసినా...నాటు కొట్టుడే
భారతీయ సినీ చరిత్రలో ఇదొక మరపురాని ఘట్టం.. సువర్ణాక్షరాలతో లిఖించదగిన పర్వం.. ఇండియన్‌ సినిమాకు ఎన్నో ఏళ్లుగా కలగా మిగిలిపోయిన ‘ఆస్కార్‌’ అవార్డు ను ‘ఆర్‌ఆర్‌ఆర్‌’  సాకారం చేసింది. అవార్డుల కుంభస్థలాన్ని బద్దలు కొడుతూ ‘నాటు నాటు...’  బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరిలో ఉత్తమ పాటగా అవార్డును సొంతం చేసుకుంది. లాస్‌ ఏంజిల్స్‌ వేదికగా 95వ ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా జరిగింది.  అంతకుముందు ఆస్కార్ అవార్డ్స్ 2023 వేడుక అట్టహాసంగా ప్రారంభమైంది.హాలీవుడ్‌కు చెందిన సినీ ప్రముఖులు, తారలతో పాటు, ఈ ఏడాది నామినేషన్లలో ఉన్న సినిమాల నటీనటులు, సాంకేతిక సిబ్బంది ఈ సంబరానికి హాజరయ్యారు. హాలీవుడ్ తారమణులు అందాలను ఆరబోస్తూ అదిరిపోయే దుస్తుల్లో దర్శనమిచ్చారు. ఇక భారతీయ సినీ ప్రేక్షకుల కలను ఆర్​ఆర్​ఆర్​ సాకారం చేసింది. సినిమాలోని ‘నాటు నాటు’ బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరిలో ఆస్కార్‌ను సొంతం చేసుకుంది.. అలాగే భారతీయ డాక్యుమెంటరీ షార్ట్‌ ‘ది ఎలిఫెంట్‌ విస్పరర్స్‌’ కూడా ఆస్కార్‌ వరించింది.

 బెస్ట్‌ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో పోటీ పడిన ‘అప్లాజ్‌’ (టెల్‌ ఇట్‌ లైక్‌ ఏ ఉమెన్‌), ‘లిఫ్ట్‌ మి అప్‌’ (బ్లాక్‌ పాంథర్‌: వకాండా ఫెరవర్‌), దిస్‌ ఈజ్‌ ఎ లైఫ్‌ (ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌’, ‘హోల్డ్‌ మై హ్యాండ్‌’ (టాప్‌గన్‌ మావెరిక్‌) పాటలను వెనక్కి నెట్టి ‘నాటు నాటు..’(RRR)కు ఆస్కార్‌ దక్కించుకుంది. బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరిలో ‘నాటు నాటు’ ప్రకటించగానే డాల్బీ థియేటర్‌ కరతాళ ధ్వనులతో దద్దరిల్లిపోయింది. ఆస్కార్‌ అవార్డును అందుకున్న ‘ఆర్ఆర్ఆర్‌’ టీమ్‌ ఆనందోత్సాహల్లో మునిగిపోయింది. అంతకుముందు కాలభైరవ, రాహుల్‌ సిప్లిగంజ్‌ లైవ్‌ ప్రదర్శనతో డాల్బీ థియేటర్‌ దద్దరిల్లిపోయింది.

నయా చరిత్ర
బెస్ట్‌ డాక్యుమెంటరీ ఫీచర్‌ ఫిల్మ్ విభాగంలో ఇండియన్‌ షార్ట్‌ ఫిల్మ్‌ సినిమా ‘ది ఎలిఫెంట్‌ విష్పరర్స్‌’ను ఆస్కార్‌ వరించింది. ఇండియా నుంచి గెలుపొందిన మొట్ట మొదటి బెస్ట్ షార్ట్ ఫిలిం ది ఎలిఫెంట్ విస్పరర్స్ చరిత్ర సృష్టించింది. తప్పిపోయిన ఓ ఏనుగును గిరిజన దంపతులు ఏ విధంగా పెంచి పోషించారు? ఈ క్రమంలో వారికి ఆ ఏనుగుతో ఎలాంటి అనుబంధం ఏర్పడింది? అనే అంశాల నేపథ్యంలో భారతీయ దర్శకురాలు కార్తికి గోన్సాల్వేస్‌ ఈ షార్ట్‌ ఫిల్మ్‌ను తెరకెక్కించారు.  95వ అకాడమీ అవార్డుల  ప్రదానోత్సవంలో భారతీయ చిత్రం తొలి అవార్డును సొంతం చేసుకుంది.ఈ మేరకు  దర్శకురాలు కార్తికి గోన్‌సాల్వెస్‌, నిర్మాత గునీత్‌ మోగ్న.. అవార్డులను అందుకున్నారు. తమ శ్రమను గుర్తించి, ప్రతిష్ఠాత్మక అవార్డును అందించిన అకాడమీ బృందానికి ధన్యవాదాలు చెప్పారు. ఈ ప్రస్తుతం ఈ డాక్యుమెంటరీ ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది.

ఉత్తమ చిత్రంగా ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌ ఆస్కార్‌ గెలుచుకుంది. ఉత్తమ నటిగా ‘మిషెల్‌ యో’ (ఎవ్రీథింగ్‌ ఎవ్రీ వేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌)  నిలిచింది. ఈ అవార్డు వేడుకలలో ఈ ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌ చిత్రానికి ఏకంగా ఏడు ఆస్కార్స్ రావడం గమనార్హం. ఉత్తమ నటుడిగా బ్రెండన్ ప్రాసెర్‌(ది వేల్‌)ఆస్కార్‌ అందుకున్నాడు. ఉత్తమ నటుడి విభాగంలో బ్రెండన్‌తో  ఆస్టిన్‌ బట్లర్‌ (ఎల్విస్‌), కొలిన్‌ ఫార్రెల్‌ (ది బన్షీష్‌ ఆఫ్‌ ఇని షెరిన్‌), బిల్‌ నిగీ (లివింగ్‌),పాల్‌ మెస్కల్‌ (ఆఫ్టర్‌సన్‌) పోటీ పడ్డారు. అయితే , ‘ది వేల్‌’ చిత్రంతో ప్రేక్షకులను కట్టిపడేసిన బ్రెండెన్‌ ఫ్రాసెర్‌ను ఆస్కార్‌ వరించింది. 

95వ అకాడమీ అవార్డ్స్‌లో  ఉత్తమ దర్శకుడిగా డానియల్ క్వాన్.. డేనియల్ షినెర్ట్ అస్కార్‌ అందుకున్నారు. ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌ చిత్రానికి గాను ఈ దర్శక ద్వయం అవార్డు గెలుచుకున్నారు.  ఈ కేటగిరిలో టాడ్ ఫీల్డ్ – టార్, మార్టిన్ మెక్‌డొనాగ్ – ది బాన్‌షీస్ ఆఫ్ ఇనిషెరిన్, రూబెన్ ఓస్ట్‌లండ్ – ట్రయాంగిల్ ఆఫ్ సాడ్‌నెస్, స్టీవెన్ స్పీల్‌బర్గ్ – ది ఫాబెల్‌మాన్స్ నామినేట్ అయ్యారు. బెస్ట్ సౌండ్ విభాగంలో హాలీవుడ్‌ మూవీ ‘టాప్ గన్ ’ ఆస్కార్‌ గెలుచుకుంది. ఈ అవార్డ్ కోసం ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్, అవతార్: ది వే ఆఫ్ వాటర్, ది బాట్‌మాన్, ఎల్విస్ పోటీపడ్డాయి. బెస్ట్‌ అడాప్టెడ్‌ స్ట్రీన్‌ప్లే విభాగంలో హాలీవుడ్‌ చిత్రం‘  ఉమెన్‌ టాకింగ్‌’కు అస్కార్‌ లభించింది. షేరా పాల్లే ఈ అవార్డును అందుకున్నారు. ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌ చిత్రాన్ని ఆస్కార్‌ వరించింది. బెస్ట్‌ ఒరిజినల్‌ స్క్రీన్‌ప్లే విభాగంలో ఈ చిత్రానికి అవార్డు లభించింది. డేనియల్‌ క్వాన్‌, డేనియల్‌ షేనెర్ట్‌లు ఈ అవార్డులు అందుకున్నారు. 

 జెమ్స్‌ కామెరూన్‌ తెరకెక్కించిన  ‘అవతార్ ది వే ఆఫ్ వాటర్’ను ఆస్కార్‌ వరించింది.  బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో ఈ చిత్రం ఆస్కార్ గెలుచుకుంది. ఈ విభాగంలో ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్, ది బ్యాట్‌మ్యాన్, బ్లాక్ పాంథర్ వకాండ ఫరెవర్, టాప్ గన్ మావెరిక్ చిత్రాలు పోటీ పడ్డాయి.బెస్ట్ ఒరిజినల్‌ స్కోర్‌ విభాగంలో  ‘ఆల్ క్వైట్ ఆన్ ది వెస్టర్న్ ఫ్రంట్’ చిత్రం ఆస్కార్‌ అందుకుంది. ఈ విభాగంలో బాబిలోన్, ది బాన్షీస్ ఆఫ్ ఇనిషెరిన్, ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ మరియు ది ఫాబెల్మాన్స్ పోటీ పడగా..’ఆల్ క్వైట్ ఆన్ ది వెస్టర్న్ ఫ్రంట్’ గెలిచింది. వాకర్‌ బెర్టెన్‌ మాన్‌ ‘ఆల్ క్వైట్ ఆన్ ది వెస్టర్న్ ఫ్రంట్’కు సంగీతం అందించారు. బెస్ట్ ప్రొడక్షన్‌ డిజైన్‌ విభాగంలో  ‘ఆల్‌ క్వైట్ ఆన్‌ ది వెస్టర్న్ ఫ్రంట్‌’ చిత్రం ఆస్కార్ అవార్డ్ గెలుచుకుంది. క్రిస్టియన్‌ ఎం గొల్డెబెక్‌ ప్రొడక్షన్‌ డిజైనర్‌గా వ్యవహరించగా, ఎర్నిస్టైన్‌ హిప్పర్‌ సెట్‌ డిజైనర్‌గా ఉత్తమ ప్రదర్శన కనబరిచారు. 

బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ది బాయ్, ది మోల్, ది ఫాక్స్ అండ్ ది హార్స్ కు ఆస్కార్‌ లభించింది. ఈ అవార్డ్ కోసం ది ఫ్లయింగ్ సెయిలర్, ఐస్ మర్చంట్స్, మై ఇయర్ ఆఫ్ డిక్స్, యాన్ ఓస్ట్రిచ్ టోల్డ్ మి ది వరల్డ్ ఈజ్ ఫేక్, ఐ థింక్ ఐ బిలీవ్ ఇట్ షార్ట్ ఫిల్మ్ నామినేట్ అయ్యాయి. ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ విభాగంలో బ్లాక్ పాంథర్: వకాండ ఫరెవర్ చిత్రం ఆస్కార్ దక్కించుకుంది. ఈ అవార్డ్ కోసం “బాబిలోన్”, “బ్లాక్ పాంథర్: వకాండ ఫరెవర్”, “ఎల్విస్”, “ఎవరీథింగ్ ఎవ్రీథింగ్ ఆల్ ఎట్ వన్స్”, “మిసెస్ హారిస్ గోస్ టు ప్యారిస్” చిత్రాలు పోటీపడ్డాయి.