వైభవంగా ఏడుపాయలలో నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

వైభవంగా ఏడుపాయలలో నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం
  • పట్టు వస్త్రాలు సమర్పించిన అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు 

ముద్ర ప్రతినిధి, మెదక్:ప్రసిద్ధ ఏడుపాయలలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆదివారం ఉదయం అమ్మవారికి జిల్లా అధిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతకుముందు రాజగోపురం వద్ద పూర్ణ కుంభ స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పల్లకిలో అమ్మవారి ఉత్సవ విగ్రహం గోకుల్ షెడ్ వరకు ఊరేగించారు. ప్రత్యేకంగా అలంకరణ చేసిన మంటపంలో అమ్మవారిని ప్రతిష్టించారు.    

 మొదటి రోజు వనదుర్గామాత శైలపుత్రి దేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ ఉత్సవంలో ఆలయ పాలకమండలి చైర్మన్ సాతెల్లి బాలాగౌడ్, ఆలయ కార్యనిర్వహణాధికారి మోహన్ రెడ్డి, ధర్మకర్త రాగి చక్రపాణి, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, మండల నాయకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా అన్నదానం ప్రారంభించారు.