విద్యుత్ స్తంభంగా వేపచెట్టు– గ్రామపంచాయతీ అధికారుల నిర్లక్ష్యం

విద్యుత్ స్తంభంగా వేపచెట్టు– గ్రామపంచాయతీ అధికారుల నిర్లక్ష్యం

ముద్ర.వీపనగండ్ల:- విద్యుత్ స్తంభానికి ఏర్పాటు చేయాల్సిన విద్యుత్ దీపాలను ప్రత్యేక అధికారుల పాలనలో గ్రామపంచాయతీ అధికారులు వేప చెట్టుకు ఏర్పాటు చేసి తమ నిర్లక్ష్యాన్ని ప్రదర్శించిన ఘటన వీపనగండ్ల మండల కేంద్రంలో చోటుచేసుకుంది. గ్రామాలలో వీధిలైట్లను ఏర్పాటు చేయాలంటే విద్యుత్ స్తంభాలకు వీధిదీపాలను అమర్చటం జరుగుతుంది. కానీ మండల కేంద్రమైన వీపనగండ్లలో గ్రామపంచాయతీ సిబ్బంది నిర్లక్ష్యంగా విద్యుత్ స్తంభానికి ఏర్పాటు చేయవలసిన వీధి దీపాన్ని వేప చెట్టుకు  అమర్చారు.

మండల పరిషత్ కార్యాలయానికి సమీపంలో  ఉన్న ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల వేప చెట్టుకు గ్రామపంచాయతీ సిబ్బంది వీధిలైటును అమర్చారు. దీనితో ఎప్పుడు ఏ ప్రమాదం చోటుచేసుకుంటున్నానని గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. బస్టాండ్ ఆవరణ కావటంతో బస్సుల కోసం వేచి చూసే ప్రయాణికులు  చెట్టు కింద నిలబడి ఉంటారని, వర్షాకాలం కావడంతో చెట్టు కు ఆమార్చిన విద్యుత్ దీపం తీగల నుంచి షాట్ సర్క్యూట్ జరిగే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. విద్యుత్ స్తంభానికి ఏర్పాటు చేయవలసిన లైటును వేప చెట్టు