వేప చెట్లకు వైరస్..!

వేప చెట్లకు వైరస్..!
  • కుట్రలు పన్నారని ప్రచారం
  • పలుచోట్ల ఎండిపోతున్న వేప చెట్లు
  • ఉగాదికి వేప పువ్వు కరువే

ముద్ర, మల్యాల: ఇండియాలో కరోనా కంట్రోల్ అయిందంటే.. దానికి వేప చెట్టు ప్రధాన కారణమని, అయితే ఇప్పుడు వేప చెట్లను నాశనం చేయడానికి ఎవరో కుట్రలు పన్నారంటూ... ప్రచారం జరుగుతోంది. చొప్పదండి నియోజకవర్గంలో పలు చోట్ల ఉన్నట్టుండి అధిక సంఖ్యలో వేప చెట్లు ఎండిపోతున్నాయి.. అయితే తెగులు సోకడం వల్లనే చెట్లు ఎండిపోతున్నాయని పలువురు పేర్కొంటున్నారు.

వేసవి మొదట్లోనే పూతకు వచ్చే వేపచెట్లు ఒక్కసారిగా ఎండిపోవడం తెగులు వలన లేక మరేదైనా కుట్రపూరిత వైరస్ వల్ల ఇదంతా జరుగుతోందా అన్న చర్చలు సాగుతున్నాయి... కాగా, ఈ విషయంమై వ్యవసాయ శాఖ అధికారులను వివరణ కోరగా, ఒక నియోజకవర్గంలోనే కాకుండా, తెలంగాణలో చాలా చోట్ల వేప చెట్లు ఓన్లీ పై భాగంలోనే ఆకులు, కొమ్మలు ఎండిపోతున్నాయ్ అన్నారు. అయితే ఫoగస్ (సిలింద్రాలు) సోకడం వల్ల అలా జరుగుతుందని, మళ్ళీ చెట్లు రికవరీ అవుతాయన్నారు.