సిబ్బంది నిర్లక్ష్యం - బంధువులే సాయం

సిబ్బంది నిర్లక్ష్యం - బంధువులే సాయం

ముద్ర ప్రతినిధి, నిర్మల్: ఆసుపత్రుల్లో సౌకర్యాల నిమిత్తం ఎన్ని నిధులు కేటాయిస్తున్నా వాస్తవ ప్రపంచంలో ఇవి ఎక్కడికి వెళుతున్నాయో తెలియని స్థితి. రోగులకు సేవ చేయాల్సిన కింది స్థాయి సిబ్బంది పట్టించుకోక పోవటం, కాసులిస్తేనే కాలు కదపటం మూలంగా రోగులు వారి బంధువులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఇందుకు నిదర్శనం భైంసా ప్రధానాసుపత్రిలో గురువారం కనిపించింది. రోగిని వైద్య సేవల కోసం స్ట్రెచర్ పై తీసుకెళ్లేందుకు సిబ్బంది లేకపోవటంతో రోగి బంధువులే తీసుకెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. లోకేశ్వరం మండలానికి చెందిన మహిళ వైద్యం కోసం ఆరోగ్య శ్రీ వార్డులో చేరి చికిత్స పొందుతోంది.    గాయానికి డ్రెస్సింగ్ నిమిత్తం ఆమెను మరో గదిలోకి తరలించాల్సి ఉండగా సహాయ సిబ్బంది ఎవరూ అందుబాటులో లేరు. దీంతో సదరు రోగి బంధువుల పిల్లలే రోగిని స్ట్రెచర్ పై తరలించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి రోగులకు సరైన వైద్య సేవలు అందేలా చూడాల్సిన అవసరం ఉంది.