మల్లెల సొబగులద్దుకున్న సర్వమంగళ స్వరూపిణి

బోడుప్పల్, ముద్ర ప్రతినిధి: బోడుప్పల్ లోని శ్రీ మాతా నిమిషాంబ ఆలయం సోమవారం ఉదయం నుంచే భక్త జనసందోహంతో నిండిపోయింది. అమ్మవారి అష్టాదశ బ్రహ్మోత్సవాలలో భాగంగా రెండోరోజు మల్లెపూల పుష్పాలంకరణంలో ఆ జగజ్జనని సర్వమంగళ స్వరూపిణిగా అఖిలాండ కోటికి విజయాలను అందించేలా దేదీప్య కాంతులతో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి అర్చకులు మంగళహారతులందించి భక్తులకు చూపించినపుడు భక్తిపారవశ్యంతో కళ్లకద్దుకున్నారు. రెండోరోజూ ఉత్సవాలలో భాగంగా హోమాలు, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.