వనపర్తి తులసివనంలో నిరంజన్ రెడ్డి గంజాయి మొక్క

వనపర్తి తులసివనంలో నిరంజన్ రెడ్డి గంజాయి మొక్క
  • చరిత్రలో నిలిచిపోయే విధంగా  మేఘారెడ్డి నామినేషన్ ఘట్టం
  • ఎఐసిసి కార్యదర్శి, క్రమశిక్షణ కమిటీ అధ్యక్షులు, మాజీ మంత్రి చిన్నారెడ్డి

 ముద్ర ప్రతినిధి, వనపర్తి: గత 60 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఎక్కడ ఎలాంటి  అవినీతి అక్రమాల మాట వినపడని, వనపర్తి నియోజకవర్గంలో కేవలం ఐదు సంవత్సరాల్లోనే  అంతుచిక్కని అవినీతి అక్రమాలకు పాల్పడుతూ నియోజకవర్గంలోని కనిపించిన భూములన్ని కబ్జా చేసే ప్రస్తుత ఎమ్మెల్యే, మంత్రి వనపర్తి తులసివనంలో గంజాయి మొక్కలాగా తయారయ్యాడని ఎఐసిసి కార్యదర్శి, క్రమశిక్షణ కమిటీ అధ్యక్షులు, మాజీ మంత్రి చిన్నారెడ్డి అన్నారు. శుక్రవారం వనపర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తూడి మేఘారెడ్డి నామినేషన్ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మొదటగా కాంగ్రెస్ పార్టీ జిల్లా పార్టీ కార్యాలయం నుంచి రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివసేన రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి క్రమశిక్షణ కమిటీ అధ్యక్షులు,  మాజీ మంత్రి చిన్నారెడ్డి,  మాజీ ఎంపీ మల్లు రవి, మేఘారెడ్డిలు ర్యాలీగా బయలుదేరి రాజీవ్ చౌరస్తాకు చేరుకున్నారు.


అక్కడినుంచి బయలుదేరి వెళ్లి కలెక్టరేట్ చేరుకున్న వాళ్లు కలిసికట్టుగా. మేఘారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అక్కడ ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం నుంచి భారీ ఎత్తున చేపట్టిన ర్యాలీలో పాల్గొని వేలాది జనాల మధ్య పాలిటెక్నిక్ కళాశాల మైదానానికి చేరుకున్నారు.సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు మాయమాటలు చెబుతూ అవినీతి అక్రమాలకు పాల్పడే ఇలాంటి మంత్రిని పంపించే రోజు వచ్చిందని, ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఓట్లను అభ్యర్థించి అఖండ మెజారిటీతో మేఘా రెడ్డిని గెలిపించాలని ఆయన కోరారు.ఈ సందర్భంగా రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివసేనారెడ్డి మాట్లాడుతూ వనపర్తి  గడ్డ ఎప్పటికీ కాంగ్రెస్ అడ్డ నేనని,  కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అవినీతిమయమైన నియోజకవర్గాన్ని కడిగేద్దామని  పిలుపునిచ్చారు.కాంగ్రెస్ ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీ పథకాలు ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్నాయని, మన రాష్ట్రంలోనూ ప్రతి ఒక్కరికి పథకాల లబ్ధి చేకూరుతుందని ఆయన పేర్కొన్నారు.


కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నేను రాజ్యసభ సభ్యుడిగా చిన్నారెడ్డి గారు మంత్రిగా మేఘరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉంటారని దీనిని ఎవరు అడ్డుకోబోలెరని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఆయాయంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవని నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం చేతులెత్తేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తుందని ఆయన పేర్కొన్నారు. తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్న తెలంగాణ ప్రభుత్వం మహిళలకు 500 కే సిలిండర్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. అధికారంలో ఉన్న తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ మేనిఫెస్టోలో 500 కే సిలిండర్ అని ప్రకటించే సరికి వారు 400 కే ఇస్తామంటూ ప్రకటించడం హాస్యాస్పదని పేర్కొన్నారు. మాజీ ఎంపీ మల్లురవి మాట్లాడుతూ ప్రజలు విజ్ఞులని, అంతా గమనిస్తూనే ఉన్నారని సమయం కోసం వేచి చూసి కొట్టే దెబ్బ మామూలుగా ఉండదని అన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని, తెలంగాణలో నిరుపేద ప్రజలందరికీ ప్రభుత్వ పథకాలు అద్భుతాయని ఆయన పేర్కొన్నారు.


ఈ సందర్భంగా వనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మెగా రెడ్డి గారు మాట్లాడుతూ వనపర్తి నియోజకవర్గం లో నియంత పాలన చేసే ఎమ్మెల్యే మంత్రి అయిన నిరంజన్ రెడ్డి నీ ఇన్నాళ్లు గౌరవించమని తాను ఆ గౌరవం ఉంచుకోకుండా మాట్లాడుతున్నారని తాను గుండుసూదితో గుచ్చితే మేము గడ్డపారతో గుచ్చేందుకు రెడీగా ఉన్నామని పేర్కొన్నారు. అడుగడుగున భూకబ్జాలకు పాల్పడుతూ అభివృద్ధి పేరు చెబుతున్నాడని, కొత్తపేటలో తన ఫామ్ హౌస్, అలంపూర్ లో తన ఫామ్ హౌస్ నిర్మించుకొని కనిపించిన చెరువు కట్టలను అభివృద్ధి పేరుతో రంగులేసి ప్రజాధనం దోచుకున్నాడని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో కేఎల్ఐ నిర్మింపబడిందని, తవ్విన కాలువలకు తాను పనిచేసి కాలువలు తవ్వి గ్రామ గ్రామానికి నీళ్లు చేర్చానని అది నువ్వు చేసిన అభివృద్ధని చెప్పుకోవడం సిగ్గుచేటుని పేర్కొన్నారు. నీకు ధైర్యం ఉంటే డబల్ బెడ్ రూమ్ ఇళ్ళను నిర్మించిన గ్రామాలలో ఓట్లు వేయించుకోవాలని, ఇందిరమ్మ ఇండ్లు నిర్మించిన గ్రామాలలో ఓట్లు అడగకూడదని ఆయన సవాల్ విసిరారు. వనపర్తి రాజకీయ ప్రస్థానంలో సురవరం ప్రతాపరెడ్డి నుంచి నేటి చిన్నన్న వరకు ఎక్కడ అవినీతి మచ్చలేదని వనపర్తి రాజకీయ చరిత్రలో నువ్వు గంజాయి మొక్కల మిగిలిపోయావని పేర్కొన్నారు. తెలంగాణ తల్లి సోనియమ్మ ఆశీర్వాదంతో ఏఐసీసీ పెద్దల సహకారంతో ఏఐసీసీ కార్యదర్శి గౌరవ చిన్నారెడ్డి గారి పట్టుదలతో రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు శివసేనారెడ్డి గారి కృషితో కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తనకు రావడం జరిగిందని.


అందుకు సహకరించిన వీరందరినీ గుండెల్లో పెట్టి చూసుకుంటానని, కొత్త పాత కాంగ్రెస్ తేడా లేకుండా అందర్నీ హాక్కున చేర్చుకుంటానని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రాచాల యుగేందర్ గౌడ్, వనపర్తి మండల సీనియర్ నాయకులు వెంకటయ్య యాదవులు చిన్నారెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో బీసీసీ ప్రెసిడెంట్ రాజేంద్రప్రసాద్ యాదవ్, ఎంపీపీ కిచ్చారెడ్డి, పట్టణ మున్సిపల్ కౌన్సిలర్లు, మాజీ జెడ్పిటిసిలు, మాజీ ఎంపీపీలు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, మాజీ సింగిల్ విండో అధ్యక్షులు, సింగిల్ విండో డైరెక్టర్లు, సర్పంచులు, ఉపసర్పంచులు,  మాజీ సర్పంచులు, వార్డు సభ్యులు,  కాంగ్రెస్ గ్రామ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు మహిళలు, యువకులు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.