రంజాన్ తోఫా వద్దు రిజర్వేషన్లు కావాలి

రంజాన్ తోఫా వద్దు రిజర్వేషన్లు కావాలి
Founder President MD Nizamuddin
  • ముస్లిం హక్కుల సాధన సమితి, వ్యవస్థాపక అధ్యక్షులు ఎండి నిజాముద్దీన్.

నాగర్ కర్నూల్ జిల్లా ముద్ర ప్రతినిధి: ముస్లిం సోదరులారా తెలంగాణ రాష్ట్రంప్రభుత్వం ముస్లింలకు రంజాన్ తోఫా అని ఒక జత బట్టలు ఒక్క పూట బిర్యాని ఇచ్చి మోసం చేస్తుంది తెలంగాణ ఉద్యమం సమయంలో సీఎం కేసీఆర్ గారు అనేక సభల్లో నూతనంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన నాలుగు నెలలకు,/ముస్లింలకు ,12 ,శాతం రిజర్వేషన్లు కల్పిస్తానని తమిళనాడు తరహా రిజర్వేషన్లు అమలు చేస్తానని వాగ్దానం చేయడం జరిగింది నేటికీ 9 సంవత్సరాలు గడిచిన ఈ యొక్క

రిజర్వేషన్లు ను అమలు కాకపోవడం చాలా బాధాకరం ముస్లింల  ఓట్లను వేసుకొని రెండోసారి అధికారంలో వచ్చిన తర్వాత కూడా ఈ రిజర్వేషన్లు ఇంతవరకు అమలు కాలేదు తెలంగాణలో రిజర్వేషన్లతో పాటు ముస్లింల డిమాండ్లు, ఇస్లామిక్ సెంటర్ మరియు సబ్ ప్లాను తెలంగాణలో రెండో అధికార భాషగా ఉర్దూను మరియు మైనార్టీ స్కాలర్షిప్లు మైనార్టీ లోన్స్ రాష్ట్రంలో సుధీర్ కమిటీ సిఫార్సులు అమలు చేయాలి మరియు బీసీ కమిషనర్ సిఫారసులు వెంటనే అమలు చేయాలి లేనిపక్షంలో ముస్లిం హక్కుల సాధన సమితి తెలంగాణ ముస్లింలను) ఐక్యం చేసి  పెద్ద ఎత్తున పోరాడుతుంది రాష్ట్ర ముస్లిం సోదరులారా ఇప్పటికైనా మన హక్కుల కొరకై పోరాడుదాం కదలండి కదలిరండి.