మున్సిపల్ వైస్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం

మున్సిపల్ వైస్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం

ముద్ర ప్రతినిధి, హుజూర్ నగర్:సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ టౌన్ 17వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ మున్సిపల్ వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు పై ఈనెల 24న అవిశ్వాస తీర్మానం పెట్టబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో బీఆర్ఎస్ కౌన్సిలర్ల మద్దతుతో జక్కుల నాగేశ్వరరావు వైస్ చైర్మన్ గా గెల్లి అర్చన రవి చైర్ పర్సన్ గా ఎన్నికయ్యారు. ఇటీవల రాష్ట్రంలో ప్రభుత్వ మార్పు కారణం అసెంబ్లీ ఎన్నికలకు ముందు కొందరు అసెంబ్లీ ఎన్నికల తర్వాత కొందరు కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో మున్సిపాలిటీలో బీఆర్ఎస్ బలం పడిపోయింది. అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందే బీఆర్ఎస్ మున్సిపల్ చైర్ పర్సన్ గెల్లి అర్చన రవి కాంగ్రెస్ లో చేరడంతో ప్రస్తుతానికి ఎటువంటి అవిశ్వాసాలకి గురికాకుండా చైర్ పర్సన్ పదవిలో కొనసాగుతున్నారు.

రాష్ట్రంలో కానీ నియోజకవర్గంలో కానీ బీఆర్ఎస్ అధికారంలో లేకపోవడం మునిసిపాలిటీలో బీఆర్ఎస్ కు బలం లేకపోవడంతో వైస్ చైర్మన్ అవిశ్వాస తీర్మానం అంశం తెరపైకి వచ్చిందని చెప్పాలి.ఈ విషయంపై స్పందించిన మూడో వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ కోతి సంపత్ రెడ్డి వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు పై అవిశ్వాస తీర్మానం పెడుతున్నట్లు తెలిసి మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా విప్ నీ జారీ చేశారని ఆ విప్ చెల్లదని మున్సిపాలిటీలో దాదాపు 1/3 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారని అన్నారు. నల్లగొండ మిగిలిన కొన్నిచోట్ల ఇదే విధంగా పాలకవర్గం చైర్మన్లు, వైస్ చైర్మన్ లపై అవిశ్వాసం తీర్మానం పెడితే స్థానిక ఎమ్మెల్యేలు జారీ చేసిన విప్ లు పరిగణలోకి తీసుకోకుండానే అవిశ్వాసాలు నెగ్గాయని అన్నారు. ఈ విషయంపై కోర్టులకు పోయిన లాభం ఉండదని ఎట్టి పరిస్థితులలో కోర్టులు వాటిని అంగీకరించవని అవిశ్వాసాలకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిపారు.మున్సిపాలిటీలో మొత్తం 28 వార్డులు ఉండగా 17 వార్డులలో కాంగ్రెస్ కౌన్సిలర్లు 10 వార్డులలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఒక వార్డులో సిపిఎం కౌన్సిలర్ గా ఉన్నందున ఈ సమయంలో వైస్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం పెడితే కాంగ్రెస్ స్పష్టమైన ఆదిక్యంతో గెలిచి కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్ వైస్ చైర్మన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి.