ఏటా దగాపడుతఉన్న దర్గా .... ఆదాయాన్ని దండుకుంటూ అభివృద్దిని అటకెక్కిస్తున్న వక్ఫ్ బోర్డు..

ఏటా దగాపడుతఉన్న దర్గా .... ఆదాయాన్ని దండుకుంటూ అభివృద్దిని అటకెక్కిస్తున్న వక్ఫ్ బోర్డు..
  • ఈ నెల 25 నుంచి మూడురోజుల పాటు జరగనున్న ఉరుసు మహోత్స్వం.మొక్కుబడిగా అధికారుల సమీక్ష... అదేశించలేని అధికారుల  వైనం
  • కోట్లలో ఆదాయం కొసరి కొసరి అభివృద్ది
  • భక్తులకు కనీస సదుపాయాలు అందించడంలో వక్ఫ్ బోర్డ్ నిర్లక్ష్యమ్  
  • సిమెంట్ ఫ్యాక్టరీలు చేస్ కంట్రిబుషన్ తోనే అభివృద్ది మమా
  • వక్ఫ్ బోర్డు జేబులోంచి పైసా తీయని వైనం
  • నిత్యాదాయంతో కాంట్రాక్టర్ల దందా..
  • కందూరుకు మూడు చోట్ల ముడుపుల చెల్లింపు

పాలకీడు,ముద్ర:- సూర్యాపేట జిల్లా పాలకీడు మండల పరిధిలో కొలువు దీరిన జన్పాహడ్ సైదులు బాబా దర్గాలో కోరిన కోరికలు తీరుతాయని ఉబయ తెలుగు రాష్ట్రాలనుంచి భక్తులు ప్రతి ఏటా జనవరి మాసంలో జరిగే ఉర్సు మహోత్సవానికి లక్షల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకుంటారు.అయితే పది రోజుల ముందు ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు మొక్కుబడిగా దర్గాకు సంబందించిన సిబ్బంది సంజాయిషీ ఇచ్చుకుంటారు.

తప్ప కోట్లల్లో ఆదాయం దండుకుంటున్నా వక్ఫ్ బోర్డు జేబులోంచి పైసా తీయకుండా ఉత్సవాలను వెల్లదీస్తుంది. ఏటా రెండు కోట్లకు కాంట్రాక్టర్లకు అప్పగించి.అరకొర నిధులతో  అభివృద్ధిని మమా అనిపిస్తున్నారు.ఎంతో దూరంనుండి వస్తున్న భక్తులు కనీస సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నోయెల్లుగా ఇదే తంతు నడుస్తున్నా వక్ఫ్ బోర్డు మాత్రం పెడచెవిన పెడుతుంది.కలెక్టర్ ఆదేశాలను సైతం పక్కకి పెట్టు తమ ఆదాయానికి గండి పడకుండా చుస్కుంటున్నారు.ఇంతకు ముందు ప్రతి శుక్ర వారం మాత్రమే కందూరు కార్యక్రమాలు నిర్వహించేవారు,రెండు సంవత్సరాలుగా శుక్ర,ఆదివారాల్లో మొక్కుబడులు చెల్లించుకుంటారు.ఆదాయం పెరిగినప్పటికీ అభివృద్ధిని మాత్రం అతకెక్కిస్తున్నరు.ప్రభుత్వ అధికారులు సరైన నిఘా పెట్టి అబివృద్దికి ఆదేశించాలని కోరుతూన్నారు.

తలుపులు లేని స్నానపు గదులు..

ఇంత జరుగుతున్నా లక్షల్లో వచ్చే  మహిళా భక్తులకు స్నానమాచరించడానికి సరైన వసతి లేదు కనీసం గదులకు తలుపు లేకపోవడంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.గోడలు శిధిలావస్థ స్థితికి చేరుకున్నాయి ..

మూడు చోట్ల ఫీజు చెల్లించాల్సిందే..

ప్రతి శుక్ర, ఆది వారాల్లో భక్తులు మొక్కులు తీర్చుకోడానికి జరుపుకునే కందూరు కార్యక్రమాలాకు మూడు చోట్ల(పైసల) ముడుపులు చెల్లించాల్సి వస్తుందని భక్తులు వాపోతున్నారు.

పక్కనే వున్న సిమెంట్ ఫ్యాక్టరీల యాజమాన్యం చేస్తున్న సదుపాయాలను తమ కాతాలో ఎసుకొని జేబులోంచి పైసా తీయకుండా పనులు చూపించి వక్ఫ్ బోర్డు పక్కకు తప్పకుంటుంది అని స్థానిక భక్తులు ఆరోపిస్తున్నారు.. ఇకనైనా అధికారులు చర్యలు తీసుకొని వక్ఫ్ బోర్డు ను అభివృద్ధిలో రాజీ పడకుండా,భక్తులకు ఇబ్బంది కలుగకుండా ఆదేశించాలని భక్తులు కోరుతున్నారు ..

ఏదైనా తాత్కాలికమే..

ఏదీ చేసిన మూడు రోజుల్లో జరిగే ఉరుసు ఉత్సవాల వరకే తాత్కాలికంగా వుంటాయి.శాశ్వతంగా సదుపాయాలు ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు..


యాతం వసంత్ నాయుడు ..భక్తుడు

దర్గా లో అంతా వ్యాపారమే భక్తుల సదుపాయాలను పట్టించుకునే నాదుడు లేడు ఎవరి లాభం వారు చూసుకోవడమే సరిపోతుంది.మహిళలకు కనీస సదుపాయాలు లేవు,కందూరు చేయాలంటే వేళల్లో డబ్బులు చెల్లించాల్సి వస్తుంది.పర్మినెంట్ బాత్రూమ్ లు లేకా చుట్టూ పక్కల దుర్వాసన వస్తుంది అయినా వక్ఫ్ బోర్డు అధికారులు పట్టించుకోవడం లేదు.యేటా ఇదే వ్యాహరం ఎన్ని వార్తలు రాసిన మార్పు లేదు..