కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రీహరి రావు నామినేషన్

ముద్ర ప్రతినిధి, నిర్మల్:అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో సోమవారం రోజున నిర్మల్  కాంగ్రెస్ అభ్యర్థి కూచాడి శ్రీహరి రావు నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారి,నిర్మల్ ఆర్డీవో రత్న కల్యాణి నామినేషన్ స్వీకరించారు. ఈ కార్యక్రమంలో శ్రీహరి రావు వెంట ఆయన కూతురు మాధురి, గాజుల రవికుమార్, పతిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి, అర్జుమంద్ ఉన్నారు.