బీజేపీ అభ్యర్థిగా నోముల దయానంద్ నామినేషన్ దాఖలు

బీజేపీ అభ్యర్థిగా నోముల దయానంద్ నామినేషన్ దాఖలు
  • హాజరైన కేంద్ర మంత్రి మహేంద్ర నాథ్ పాండే 

ఇబ్రహీంపట్నం, ముద్ర: బీజేపీ ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా నోముల దయానంద్ గౌడ్ నామినేషన్ పాత్రలను దాఖలు చేశారు. ఇబ్రహీంపట్నంలోని ఆర్డీఓ కార్యాలయంలో బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి మహేంద్ర నాథ్ పాండే, మహారాష్ట్ర ఎమ్మెల్యే సందీప్ ప్రభాకర్ దుర్వేలతో కలిసి ఆయన నామినేషన్ కేంద్రానికి వచ్చారు. నామినేషన్ పత్రాలను దాఖలు చేసిన అనంతరం కేంద్రమంత్రి మహేంద్ర నాథ్ పాండే మాట్లాడుతూ తెలంగాణలో బీసీల ఆకాంక్షను నెరవేర్చిది బీజేపీ మాత్రమేనని అన్నారు. యువతను మోసం చేస్తోన్న బీఆర్ఎస్ ను సాగణంపాలని పిలుపునిచ్చారు. టీఎస్పీఎస్సీ పేపర్ల లీకులతో నిరుద్యోగులను బీఆర్ఎస్ ప్రభుత్వం దగా చేస్తుందన్నారు. బీసీ యువత కోసం బీఆర్ఎస్ సర్కార్ చేసిందేమీ లేదన్నారు. బీసీలకు రూ. లక్ష ఇస్తామన్న వాగ్దానాన్ని కేసీఆర్ సర్కార్ విస్మరించిందని విమ ర్శించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీగాలి మాటలుగానే మిగిలిపోయాని విమర్శించారు. ఇబ్రహీంపట్నం నోముల దయానంద్ గౌడ్ ను గెలిపించి ఒక బీసీ వ్యక్తిని శాసన సభకు పంపాలని పిలుపునిచ్చారు. బీజేపీ అభ్యర్థి నోముల దయానంద్ గౌడ్ మాట్లాడుతూ స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలన్న దృక్పథంతో ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, ప్రవేశ పెడతున్న సంక్షేమ పథకాలు తనను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు.