అందరికీ ఉద్యోగాలు ఇవ్వలేం

అందరికీ ఉద్యోగాలు ఇవ్వలేం
  • పరిశ్రమల స్థాపన ద్వారా ఉద్యోగాలు
  • నాడు మైగ్రేషన్ నేడు ఇరిగేషన్
  • మంత్రి కేటీఆర్

ముద్ర ప్రతినిధి, మహబూబ్ నగర్: చదువుకున్న ప్రతి వ్యక్తికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడం ఏ ప్రభుత్వానికి సాధ్యం కాదని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట తారక రామారావు అన్నారు. గురువారం మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర, మహబూబ్నగర్ నియోజకవర్గల్లో ఆయన పర్యటించారు. మూసాపేట మండలం లో ఎస్ జిడి ఫార్మా కార్నింగ్ టెక్నాలజీ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ లతో కలిసి ఆయన భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డబ్బులు అందరి వద్దా ఉంటాయి కానీ కొంతమందికి మాత్రమే సేవ చేసే దృక్పథం ఉంటుందన్నారు.

మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేసి ఎంతో మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం గొప్ప విషయం అన్నారు. పాలమూరు ఇప్పుడు పరిశ్రమల హబ్ గా మారిందన్నారు. నాడు పరిశ్రమల స్థాపన రెడ్ టేప్ ఉంటే నేడు టిఆర్ఎస్ ప్రభుత్వం రెడ్ కార్పెట్ పరిచిందన్నారు. ప్రైవేట్ రంగాల్లో నైపుణ్యాలు అంది పుచ్చుకుంటేనే భవిష్యత్తు ఉంటుందన్నారు. ప్రతి వ్యక్తికి ప్రభుత్వ ఉద్యోగం రాదన్నారు .అది ఎక్కడ, ఏ ప్రభుత్వం ఇవ్వలేదన్నారు. 

తెలంగాణ జనాభా నాలుగు కోట్లకు పైగా ఉంటే అందులో సర్కారు కొలువులు ఆరున్నర లక్షలు మాత్రమే అన్నారు. నాడు వలసలకు మారుపేరుగా ఉన్న పాలమూరు నేడు పచ్చని పంట పొలాలతో కళలాడుతుందన్నారు. దేవరకద్ర నియోజకవర్గంలో 90 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. రాష్ట్రంలో 24 గంటలు కరెంటు  ప్రజలకు అందుబాటులో ఉందన్నారు.రైతులకు వ్యవసాయానికి ఉచిత కరెంట్ ఇస్తున్నామన్నారు.దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వడం లేదన్నారు. 9 ఏళ్లలో రాష్ట్రం ఎంత ప్రగతి సాధించించమన్నరు. వలస పాలనలో ఎక్కడో ఉన్న మనంఎక్కడికో వచ్చామన్నారు.

ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసుకున్నాం.ప్రభుత్వ ఆసుపత్రిలో 30% ఉన్న కాన్పులు నేడు 60% పెరిగావన్నరు.నాడు రియల్ ఎస్టేట్ ధర ఎంత నేడు భూముల ధర ఎంత ఉందో ప్రజలు గమనించాలన్నారు. ఎన్నికల సమీపిస్తున్నాయి కాంగ్రెస్ బిజెపి పార్టీలు సంక్రాంతి పండగ ముందు గంగిరెద్దుల ఇండ్ల ముందుకు వస్తారన్నారు. బిజెపి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అన్ని వర్గాల ప్రజలు అబివృద్దికి దూరంగా ఉన్నాయన్నారు. ఏ ప్రభుత్వాలు చేయలేని పనులు కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం చేసిందన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి వెంకటేశ్వర రెడ్డి గువ్వల బాలరాజ్