గంగమ్మ దేవతకు వెండి గొలుసు బహుకరణ

గంగమ్మ దేవతకు వెండి గొలుసు బహుకరణ

ముద్ర. వీపనగండ్ల:- కోరిన కోరికలు తీరుస్తూ భక్తుల కొంగుబంగారంగా వెలుగొందుతున్న వీపనగండ్ల గంగమ్మ దేవతకు గ్రామ పెద్దలు వెండితో తయారు చేయించిన పెద్ద గొలుసును బహుకరించారు.దీపావళి పండుగను పురస్కరించుకొని గ్రామంలోని గంగమ్మ దేవతకు గ్రామంలోని పెద్దలు 56 తులాల తో వెండితో పెద్ద గొలుసును తయారు చేయించి గ్రామపంచాయతీ కార్యాలయంలో ఉంచారు.

పండుగ సందర్భంగా గ్రామ రైతు కమిటీ, గ్రామ పెద్దలు అమ్మవారి కోసం తయారు చేయించిన పెద్ద గొలుసును గ్రామపంచాయతీ కార్యాలయం నుంచి గ్రామ పెద్దల సమక్షంలో ఊరేగింపుగా తీసుకువెళ్లి అమ్మవారికి బహుకరించారు. ఇట్టి కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ గంగిరెడ్డి, రైతు కమిటీ అధ్యక్షుడు వెంకట్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ముంతా కృష్ణయ్య, నాయకులు ముంతా మల్లయ్య యాదవ్, ఎత్తం కృష్ణయ్య, ఎత్తం బాలస్వామి, రవీందర్ రెడ్డి, ఆవుల నారాయణ, సిహెచ్ వెంకటయ్య, నరసింహ, వీరబాబు, కత్తి నరసింహ తదితరులు ఉన్నారు.