ఓటును వినియోగించుకున్న శతాధిక వృద్దురాలు

ఓటును వినియోగించుకున్న శతాధిక వృద్దురాలు

కోరుట్ల, ముద్ర:కోరుట్ల నియోజకవర్గం కల్లూరు గ్రామ పంచాయతీ లో పోలింగ్ బూత్ నెంబర్ 111 లో గ్రామానికి చెందిన హోటల్ గంగమ్మ అనే 108 సంవత్సరాల వృద్ధురాలు తన ఓటు హక్కును వినియోగించుకున్నారని గ్రామ మాజీ సర్పంచ్ వన తడుపుల అంజయ్య తెలియజేశారు. తనకు ఎనిమిది మంది సంతానం అని, చాలా పెద్ద ఉమ్మడి కుటుంబం అని తన పెద్ద కూతురికి 80 పై బడిన వయస్సు ఉందన్నారు. స్వయంగా పోలింగ్ కేంద్రానికి వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్న గంగమ్మను చూసి గ్రామస్తులు అధికారులు నివ్వెరపోయారు.