పులివెందులలో కాల్పులలో ఒకరి మృతి

పులివెందులలో కాల్పులలో ఒకరి మృతి

రాయలసీమలో మరోసారి ఫ్యాక్షన్ రాజకీయాలు భగ్గుమన్నాయి. పులివెందులలో తుపాకీ కాల్పులు తీవ్ర కలకలం రేపాయి. కడప వైసీపీ ఎంపీ అవినాశ్‌రెడ్డి అనుచరుడు భరత్ తుపాకీతో ప్రత్యర్థులపై చెలరేగిపోయాడు. భరత్  జరిపిన కాల్పుల్లో తెలుగుదేశం పార్టీ  కి చెందిన కార్యకర్త దిలీప్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.  తెలుగు దేశం పార్టీకి చెందిన దిలీప్‌, బాషాపై భరత్‌ తుపాకీతో కాల్పులకు తెగబడ్డాడు. తుపాకీతో 4 రౌండ్లు కాల్పులకు పాల్పడ్డాడు.

ఛాతీపై కాల్పులు జరపడంతో టీడీపీ కార్యకర్త దిలీప్‌ ప్రాణాలు వదిలాడు. మరోవైపు తీవ్రగాయాలతో బాషా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. డబ్బుల వ్యవహారంలో ఇరువురిపై భరత్‌ కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది.  భరత్‌ దగ్గర దిలీప్ అప్పుగా డబ్బులు తీసుకున్నాడు. ఇదే విషయంపై దిలీప్‌ను డబ్బులు ఇవ్వాలంటూ భరత్ గట్టిగా నిలదీశాడు. ఈ డబ్బుల వ్యవహారంలో గొడవ చోటుచేసుకోవడంతో దిలీప్‌, బాషాపై భరత్‌ తుపాకీ తీసి కాల్పులకు పాల్పడ్డాడు. నాలుగు రౌండ్లు కాల్పులు జరపడంతో దిలీప్ ఛాతీలోకి బుల్లెట్ దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మరోవైపు భాషా తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.