నెల రోజులపాటు ఆపరేషన్ స్మైల్  స్పెషల్ డ్రైవ్.

నెల రోజులపాటు ఆపరేషన్ స్మైల్  స్పెషల్ డ్రైవ్.
  • బాలలకు మంచి భవిష్యత్తు ఇవ్వడం అందరి బాధ్యత.
  • బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనలో అందరూ భాగస్వామ్యం కావాలి.
  • రాహుల్ హెగ్డే  ఎస్పీ సూర్యాపేట.

ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-జనవరి నెలలో నిర్వహిస్తున్న 10వ విడత ఆపరేషన్ స్మైల్ కార్యక్రమానికి సంబంధించి అధికారులతో బుధవారం జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే  జిల్లా పోలీస్ కార్యాలయం అధికారులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా ఎస్పీ  మాట్లాడుతూ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, మానవ అక్రమ రవాణ నిరోధం, తప్పిపోయిన బాలల గుర్తింపు, నిరాదరణకు గురైన పిల్లల సంరక్షణ లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం జనవరి నెలలో ఆపరేషన్ స్మైల్, జులై నెలలో ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందన్నారు.దీనిలో భాగంగా ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాల ద్వారా నిరాధారణకు గురైన తప్పిపోయిన, వెట్టి చాకిరికి గురవుతున్న బాలలను సంరక్షించడం జరుగుతుందన్నారు .సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఆపరేషన్ స్మైల్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని, లక్ష్యం కోసం పని చేయాలని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే  తెలిపినారు.  జిల్లాలో ఆపరేషన్ స్మైల్ నిర్వహణ కు సూర్యాపేట సబ్ డివిజన్ కోదాడ సబ్ డివిజన్ వారిగా పోలీస్ టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ పోలీస్ టీమ్స్ చైల్డ్ వెల్ఫేర్, లేబర్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, పోలీస్ టీమ్స్, ఐసిడిఎస్, భరోసా సెంటర్ సిబ్బంది సమన్వయంతో పనిచేసి నిరాధారణకు గురైన పిల్లలను గుర్తించాలి అన్నారు. 

మెకానిక్ షాప్స్, ఇండస్ట్రీ లు, వలస కూలీలు,  ఇటుకల తయారీ పరిశ్రమలు, మైన్స్, హోటల్స్, దాబాలు, ఇందన అవుట్ లెట్స్, గోదాములు లాంటి వాటిల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తాం అన్నారు. వెట్టి చాకిరికి గురవుతున్న, తప్పిపోయిన, నిరాధారణకు గురవుతున్న బాలలను గుర్తించి సంరక్షణ కేంద్రాలకు తరలించడం, తల్లిదండ్రులకు అప్పగించడం జరుగుతుంది అని తెలిపినారు. బాలలను వేధింపులకు గురిచేసిన, వెట్టిచాకిరి చేయిస్తున్న, ఇతర ఏ రకంగా నిరాధారణకు గురి చేసిన అలాంటి వారి సమాచారాన్ని పోలీసు వారికి లేదా చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు అందజేయాలని ఎస్పీ  కోరినారు. సమాచారాన్ని డయల్ 100, చైల్డ్ హెల్ లైన్ 1098 కి సమాచారం అందించాలి అన్నారు. 

ఈ సమావేశంలో అదనపు ఎస్పీ నాగేశ్వరరావు, డి.ఎస్.పి రవి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ రమణారావు, లేబర్ కమిషనర్ మంజుల, డీఎంహెచ్వో కోటా చలం, జిల్లా సంక్షేమ అధికారి జ్యోతి పద్మ,  చైల్డ్ వెల్ఫేర్ అధికారులు రవి కుమార్, నాగరాజు, నాగులమీర, పోలీస్ రిస్కూ టీమ్స్ ఉన్నారు.